సుదీర్ఘకాలంగా సినిమా ఇండస్ట్రీలో ఉంటూ ఇప్పటివరకూ పెద్దగా వివాదాల్లోకి వెళ్లని ఒకే ఒక్కడు అర్జున్ కు మీటూ సెగ తగలటం తెలిసిందే. మీటూ మీద సాగుతున్న ఉద్యమంలో భాగంగా నటి శృతి హరహరణ్ తాజాగా అర్జున్ మీద ఆరోపణలు చేయటం.. రిహార్సల్స్ లో భాగంగా తన పట్ల అర్జున్ అసభ్యంగా ప్రవర్తించారని.. రిసార్ట్ కు రమ్మన్నారంటూ ఆమె చేసిన ఆరోపణలు సంచలంగా మారాయి.
సినిమాను ఆపటం ఎందుకన్న ఉద్దేశంతో అప్పట్లో తానీ విషయాన్ని బయటకు చెప్పలేదన్న శృతి ఆరోపణలపై అర్జున్ కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అర్జున్ కుమార్తె ఐశ్వర్య తాజాగా శృతి తీరును తప్పు పట్టారు. నిబునన్ సినిమా షూటింగ్ సమయంలో తన తండ్రి అసభ్యంగా వ్యవహరించారని చెప్పటంలో అర్థం లేదని ఆమె మండిపడుతున్నారు.
మా నాన్న తాను చేసే సినిమాలకు సంబంధించిన స్క్రిప్ట్ లను మమ్మల్ని కూడా వినమంటారు. నిబునన్ సినిమా స్క్రిప్ట్ లో రెండు మూడు చోట్ల ఇబ్బందికర సన్నివేశాలు ఉన్నాయి. అప్పుడు నాన్న వాటిని తొలగిస్తే కానీ ఆ సినిమా చేయనని చెప్పారు. మరి.. ఆ సమయంలో శృతి ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.
తనకున్న సమాచారం ప్రకారం శృతి కేవలం ఐదారురోజులు మాత్రమే షూటింగ్లో పాల్గొన్నారని.. తన తండ్రి కారణంగా ఇబ్బంది కలిగిందని రిహార్సల్స్ కోసం సెట్‌కు రాన్నట్లు ఫేస్ బుక్ ద్వారా చెప్పినట్లు వెల్లడించారు. అలాంటప్పుడు ఆమెను రిసార్ట్ కి రమ్మని.. డిన్నర్ కు రావాలని పిలవటానికి తన తండ్రికి టైం ఎక్కడ ఉంటుందని క్వశ్చన్ చేశారు.
ఇన్నేళ్ల తన జీవితంలో తన తండ్రి పబ్ కు వెళ్లింది తాను చూడలేదని.. అలాంటిది ఆమెను రిసార్ట్ కు రమ్మని ఎందుకు ఆహ్వానిస్తారంది. ఒక వ్యక్తికి ఇష్టం లేకుండా అతనిపట్ల దురుసుగా కానీ అసభ్యంగా కానీ ప్రవర్తిస్తే దాన్ని మీటూ అంటారని.. శృతి చేస్తున్న ఆరోపణల్లో మీటూ ఇష్యూ ఎక్కడా కనిపించలేదన్నారు.
సొంత లాభాల కోసం ఇలా చేయటం సరికాదన్న ఆమె.. ఇలా చేయటం వల్లే ఆమె పేరు అన్ని ఛానళ్లలో మారుమోగుతుందన్నారు. తాను మాత్రం ఆమెలా ఆలోచించలేదన్న ఐశ్వర్య.. తన తండ్రి మీద నటి శృతి చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండించింది.