చాలా మందికి జీవితంలో మధుర జ్ఞాపకాలు, చేదు అనుభవాలు కామన్ గా వుంటాయి. అలాంటి అనుభవాలే తమి హీరోయిన్ ఐశ్వర్యా మీనన్ కు ఉన్నాయట. సిద్ధార్ధ్, అమలా పాల్ జంటగా నటించిన 'లవ్ ఫెయిల్యూర్' మూవీతో నటిగా కెరీర్ ప్రారంభించిన ఐశ్వర్యా మీనన్ తమిళ మూవీ 'ఆపిల్ పెన్నె'తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. వీరా, తమిళ పదం 2 వంటి సినిమాల్లో నటించి హీరోయిన్ గా మంచి గుర్తింపుని సొంతం చేసుకుంది.
ప్రస్తుతం 'కార్తికేయ 2'తో పాన్ ఇండియా స్టార్ గా మారిన నిఖిల్ తో కలిసి 'స్పై' మూవీలో నటిస్తోంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ మూవీ ఐశ్వర్యా మీనన్ నటిస్తున్న ఫస్ట్ తెలుగు సినిమా. ఐదు భాషల్లో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ కానున్న ఈ సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో వుంది. ఈ మూవీతో తెలుగులో పాగా వేయాలని ఐశ్వర్యామీనన్ ప్లాన్ చేసుకుంటోంది. ఎలాగైనా ఈ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని ఈ ప్రాజెక్ట్ పై భారీ ఆశలే పెట్టుకుంది.
రీసెంట్ గా అరుణ్ విజయ్, వాణీ భోజన్ తో కలిసి 'తమిళ్ రాకర్స్' అనే వెబ్ సిరీస్ లోనూ నటించిన ఐశ్వర్యామీనన్ ఈ సిరీస్ తో తొలిసారి డిజిటల్ వరల్డ్ లోకి అడుగుపెట్టి మంచి పేరు తెచ్చుకుంది. రీసెంట్ గా ఈ సిరీస్ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లీవ్ లో స్ట్రీమింగ్ అయిన విషయం తెలిసిందే. ఇదిలా వుంటే సోషల్ మీడియా వేదికగా బాక్సింగ్ గ్లౌవ్స్ ని ధరించి సీనియస్ గా వర్కవుట్స్ చేస్తున్న ఫొటోలని అభిమానులతో షేర్ చేసింది. ఈ ఫొటోలతో పాటు ఆసక్తికరమైన వ్యాఖ్యలని జత చేసింది.
తన వ్యక్తిగతమైన విషయాలని ఈ సందర్భంగా అభిమానులతో పంచుకుంది. అంతే కాకుండా తన చైల్డ్ హుడ్ నాటి రోజులు ఎంత కష్టంగా, ఇబ్బందికరంగా గడిచాయో వెల్లడించింది. ఫిట్ నెస్ కి సంబంధించిన జర్నీ నా వ్యక్తిగతమైనదని తెలిపింది.
అంతే కాకుండా తాను చిన్నతనంలో చాలా లావుగా వుండేదాన్నని, నిరంతరం తనని అంతా ఎగతాళి చేసేవారని చెప్పుకొచ్చింది. చిన్నతనంలో తను లావుగా వుండటం వల్ల స్కూల్లో అంతా తనని 'మైదాబాల్' అని పిలిచేవారని, అది తనని చాలా బాధించేదని పేర్కొంది.
ఆ సమయంలో తాను అమాయకంగా వుండేదానినని, తాను ఎగతాళికి గురి కావడం వల్లే ఫిట్ నెస్ పై ప్రత్యేక శ్రద్ద పెట్టానని చెప్పుకొచ్చింది. అయితే తనని అప్పట్లో ట్రోల్ చేసిన వారు ఇప్పడు అదే పంథాలో పిలిస్తే బాక్సింగ్ తో చెడుగుడు ఆడేస్తాననే రేంజ్ లో ఐశ్వర్య మీనన్ ఫోటోలకు పోజులివ్వడంతో ఆ ఫొటోలు ప్రస్తుత నెట్టింట వైరల్ గా మారాయి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.