ఈ ప్రాజెక్ట్ అయినా అజ‌య్ ని గ‌ట్టెక్కిస్తుందా?

Update: 2022-10-13 03:30 GMT
తొలి ప్ర‌య‌త్నంగా క్రేజీ బ్లాక్ బ‌స్ట‌ర్ ని ద‌క్కించుకున్న ద‌ర్శ‌కుల‌కు, హీరోల‌కు సెకండ్ సినిమా గండం వెంటాడుతూ వుంటుంది. అది వ‌ర్క‌వుట్ అయ్యిందా? ఆ త‌రువాత వారి కెరీర్ కి ఎక్క‌డా స్టాప్ వుండ‌దు. కానీ రెండ‌వ సినిమా ఫ్లాప్ అయిందా?.. మూడ‌వ ప్రాజెక్ట్ ప‌ట్టుకోవ‌డం క‌ష్టంగా మారుతూ వుంటుంది. ఇప్ప‌డు ఇదే ప‌రిస్థితిని ఎదుర్కొంటున్నాడు ద‌ర్శ‌కుడు అజ‌య్ భూప‌తి. య‌దార్ధ క‌థ ఆధారంగా అజ‌య్ భూప‌తి తెర‌కెక్కించిన మూవీ `Rx 100`.

అజ‌య్ భూప‌తికిది తొలి సినిమా. కార్తికేయ గుమ్మ‌కొండ‌, పాయ‌ల్ రాజ్ పుత్ హీరో, హీరోయిన్ లుగా న‌టించిన ఈ మూవీ 2018 జూలై12న విడుద‌లై అజ‌య్ భూప‌తికి, హీరో, హీరోయిన్ లు కార్తికేయ గుమ్మ‌కొండ‌, పాయ‌ల్ రాజ్ పుత్ ల‌కు తిరుగులేని గుర్తింపుని తెచ్చిపెట్టింది. కేవ‌లం రూ. 2 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద రూ. 25 కోట్ల‌కు మించి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టి మేక‌ర్ కి కాసుల వ‌ర్షం కురిపించింది.

`Rx 100` ఊహించ‌ని విజ‌యం త‌రువాత భారీ మ‌ల్టీస్టార‌ర్ ని తెర‌పైకి తీసుకురావాల‌ని అజ‌య్ భూప‌తి విశ్వ ప్ర‌య‌త్నాలు చేశాడు. ప‌లువురు క్రేజీ స్టార్ల‌ని సంప్ర‌దించాడు. కానీ చివ‌రికి శ‌ర్వానంద్‌, సిద్ధార్ధ్ ల‌తో `మ‌హా స‌ముద్రం` పేరుతో భారీ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ ని తెర‌కెక్కించాడు. అజ‌య్ భూప‌తి భారీ అంచ‌నాలు పెట్టుకున్న ఈ మూవీ ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక‌పోయింది. ఫేడ‌వుట్ అయిన సిద్ధార్ధ్ , బ‌లం లేని క‌థ‌ల కార‌ణంగా ఏ విష‌యంలోనూ ఈ మూవీ ఆక‌ట్టుకోలేక డిజాస్ట‌ర్ గా నిలిచి షాకిచ్చింది.

ఈ మూవీ విడుద‌లై ఏడాది కావ‌స్తున్నా అజ‌య్ భూప‌తి గ‌త కొంత కాలంగా సైలెంట్ అయిపోయాడు. ఇదిలా వుంటే అజ‌య్ భూప‌తి త‌న మూడవ ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడ‌ని తెలుస్తోంది. ఫ‌స్ట్ మూవీలో పాయ‌ల్ రాజ్ పుత్ పాత్ర‌ని హైలైట్ గా డిజైన్ చేసిన అజ‌య్ భూప‌తి త‌న మూడ‌వ ప్రాజెక్ట్ ని మ‌హిళా ప్ర‌ధాన చిత్రంగా తెర‌పైకి తీసుకురాబోతున్నాడ‌ట‌.

ఈ మూవీలోని విల‌న్ పాత్ర కోసం మార్ష‌ల్ ఆర్ట్స్ లో ప్రావిణ్యం వున్న ఓ ఫేమ‌స్ లేడీని ఎంపిక చేసుకున్నాడ‌ట‌. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ స్టేజ్ లో వున్న ఈ మూవీ త‌రువాత బాలీవుడ్ ఫిల్మ్ మేక‌ర్ కు అజ‌య్ భూప‌తి ఓ సినిమా చేయ‌నున్నాడ‌ని తెలిసింది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News