#RRR : ఒక్కరికి కాదు ఇద్దరికి గురువు

Update: 2020-06-25 13:30 GMT
టాలీవుడ్‌ ప్రేక్షకులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రం ‘ఆర్‌ఆర్‌ఆర్‌’. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో రామ్‌ చరణ్‌ మరియు ఎన్టీఆర్‌ లు హీరోలుగా నటిస్తున్నారు. స్వాతంత్య్రంకు పూర్వం పరిస్థితులతో ఈ సినిమాను జక్కన్న తెరకెక్కిస్తున్నాడు. రామ్‌ చరణ్‌ అల్లూరి సీతారామరాజుగా ఎన్టీఆర్‌ కొమురం భీమ్‌ గా నటిస్తున్న విషయం తెల్సిందే. ఈ చిత్రంలో బాలీవుడ్‌ స్టార్‌ అజయ్‌ దేవగన్‌ చేస్తున్న పాత్ర గురించి రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

మొన్నటి వరకు కొమురం భీమ్‌ కు స్వాతంత్య్ర కాంక్షను కలిగించే పాత్రలో అజయ్‌ దేవగన్‌ నటించాడు అంటూ వార్తలు వచ్చాయి. ఆ తర్వాత కొందరు అల్లూరి సీతారామరాజు పాత్రకు బాబాయి అవుతాడనే ప్రచారం కూడా జరిగింది. తాజాగా మరో ప్రచారం జరుగుతోంది. అల్లూరి మరియు కొమురం భీమ్‌ లు ఇద్దరు కూడా కొంత కాలం అజ్ఞాతంలోకి వెళ్లి పోతారు. ఆ సమయంలో వారు ఎక్కడకు వెళ్లారు అనేది తెలియదు. జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమాలో వారు అజయ్‌ దేవగన్‌ వద్దకు వెళ్లినట్లుగా చూపించబోతున్నాడట.

అల్లూరి మరియు కొమురం భీమ్‌ లు అజ్ఞాతంలో ఉన్న సమయంలో అడవుల్లో ఉంటూ స్వాతంత్య్ర పోరాటం చేస్తున్న అజయ్‌ దేవగన్‌ టీం వద్దకు ఉంటారు. అజయ్‌ దేవగన్‌ వద్దే అల్లూరి మరియు కొమురం భీమ్‌ లు యుద్ద విద్యలు నేర్చుకోవడంతో పాటు స్వాతంత్య్ర కాంక్షతో రగిలి పోతారు. ఆయన ప్రోత్సాహం మరియు ఆయన తోడ్పాటుతో ఇద్దరు కూడా బ్రిటీష్‌ వారిపైకి యుద్దంకు వెళ్తారు అనేది కథాంశంగా ప్రచారం జరుగుతోంది. మొత్తానికి అల్లూరి కొమురం భీమ్‌ ల గురువుగా అజయ్‌ దేవగన్‌ కనిపిస్తాడంటూ టాక్‌ వినిపిస్తుంది. అసలు విషయం ఏంటీ అనేది సినిమా విడుదల అయితే కాని తెలియదు. వచ్చే ఏడాది జులైలో సినిమా విడుదల అయ్యే అవకాశం ఉంది.
Tags:    

Similar News