రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో కీలక పాత్రను బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ పోషిస్తున్న విషయం తెల్సిందే. రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర అయినా కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది. అలాంటిది అజయ్ దేవగన్ హీరోకు గురువుగా కనిపించబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. అంతటి కీలక పాత్రలో నటిస్తున్న అజయ్ దేవగన్ మరో సినిమా ‘భుజ్’. షూటింగ్ పూర్తి అయ్యి విడుదలకు సిద్దంగా ఉన్న ఈ సినిమాను థియేటర్లు ఓపెన్ లేని కారణంగా ఓటీటీ విడుదలకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఓటీటీలో విడుదలకు అంతా రెడీ అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా అజయ్ దేవగన్ ఫ్యాన్స్ నుండి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ట్విట్టర్ లో భుజ్ చిత్రం ఓటీటీ విడుదలను బ్యాన్ చేయాల్సిందే అంటూ హ్యాష్ ట్యాగ్ ను పోస్ట్ చేస్తున్నారు. #BoycottBhujOnOTT అనే హ్యాష్ ట్యాగ్ ప్రస్తుతం ట్విట్టర్ లో ట్రెండ్ అవుతుంది.
స్టార్ హీరోల సినిమాలు కూడా ఇలా ఓటీటీ పై విడుదల అవ్వడం ఏంటీ అంటూ కొందరు ఇండస్ట్రీ వర్గాల వారు కూడా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాస్త ఆలస్యం అయినా కూడా భుజ్ చిత్రంను థియేటర్లలో విడుదల చేయాల్సిందిగా ఫ్యాన్స్ మరియు ప్రేక్షకులు అంటున్నారు. కాని మేకర్స్ మాత్రం సినిమాను ఓటీటీలో విడుదల చేసేందుకు దాదాపుగా రెడీ అయ్యారు. ఫ్యాన్స్ డిమాండ్ పట్ల అజయ్ దేవగన్ ఎలా స్పందిస్తాడా అంటూ అంతా ఎదురు చూస్తున్నారు.