దర్శకనిర్మాతలు అనవసరంగా పొరుగు భాషలకి చెందిన నటుల్ని ఆశ్రయిస్తుంటారు కానీ... తెలుగు ఇండస్ట్రీలోనే ప్రతిభగల నటులు చాలామంది ఉన్నారు. వాళ్లకి అవకాశమివ్వాలి కానీ దుమ్ము దులిపేస్తారు. అప్పుడప్పుడు వచ్చే సాదాసీదా అవకాశాల్ని కూడా అద్భుతంగా సద్వినియోగం చేసుకొంటూ అసలు సిసలైన నటనని ప్రదర్శిస్తుంటారు. శభాష్ అనిపించుకొంటుంటారు. ఆ తరహా నటుల్లో అజయ్ ఒకరు. మొదట్లో చిన్న చిన్న పాత్రల్లోనే కనిపించేవాడాయన. ఆ తర్వాత రాజమౌళిలాంటి దర్శకులు విలన్ గా ప్రమోట్ చేశారు. విక్రమార్కుడులో అజయ్ కనిపించిన విధానం చూస్తే మైండ్ బ్లోయింగ్ అంతే. అందులో క్రూరమైన ప్రతినాయకుడిగా కనిపించాడు. ఆ సినిమాతో అజయ్ పేరు మార్మోగిపోయింది.
అయితే ఆ తర్వాత మాత్రం చెప్పుకోదగ్గ అవకాశాలు లభించలేదు ఆయనకి. మంచి పాత్రలు దక్కిన ప్రతిసారీ నటుడిగా ఓ వెలుగు వెలుగుతుంటాడు అజయ్. కానీ ఆయన్ని ఇండస్ట్రీనే సరిగ్గా ఉపయోగించుకోలేదు. ఇష్క్ సినిమాలో హీరోయిన్ కి అన్నయ్యగా అజయ్ మంచి నటనని కనబరిచాడు. ఆ చిత్రంలో తన టాలెంట్ ని చూసిన దర్శకుడు విక్రమ్ కుమార్ ఇప్పుడు మరోసారి ఓ కీలక పాత్రని అప్పజెప్పాడు. తన దర్శకత్వంలో సూర్య కథానాయకుడిగా తెరకెక్కుతున్న 24లో అజయ్ తో ఓ కీలక పాత్ర చేయించాడు. సూర్యతో పాటే ఉండే పాత్ర అట అది. అందులో నా యాక్టింగ్ స్కిల్స్ మరింతగా బయట పడతాయని అజయ్ చెబుతున్నాడు. విక్రమ్ కుమార్ ఇష్క్ తో ఇచ్చిన ఆ పాత్రతో అజయ్ కి ఎంతగా పేరొస్తుందో చూడాలి.