సూపర్ స్టార్ రజినీకాంత్.. యూనివర్శల్ స్టార్ కమల్ హాసన్.. ఇళయదళపతి విజయ్.. తల అజిత్.. వీళ్లందరూ చేయి చేయి కలపబోతున్నారు. అలాగని వీళ్లందరూ కలిసి ఏదైనా మల్టీస్టారర్ మూవీ సినిమా చేసేస్తున్నారేమో అనుకోకండి. వీళ్లు ఓ మంచి పని కోసం ఒకే వేదిక మీదికి వస్తున్నారు. నడిగర్ సంఘం కోసం ఓ బిల్డింగ్ కట్టించడానికి నిధులు సేకరించేందుకు వీళ్లందరూ కలిసి ఓ క్రికెట్ మ్యాచ్ ఆడబోతున్నారు. గత ఏడాది నాజర్ నేతృత్వంలోని ప్యానల్ నడిగర్ సంఘం ఎన్నికల్లో ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. ఆ సందర్భంగా నడిగర్ సంఘం కోసం ఓ బిల్డింగ్ కట్టించి తీరుతామని కార్యదర్శిగా ఎన్నికైన విశాల్ ప్రతిజ్న చేశాడు. ఈ పని పూర్తయితే తప్ప పెళ్లి కూడా చేసుకోనని పంతం పట్టాడు విశాల్.
ముందు హామీ ఇచ్చినట్లుగానే ఇటీవలే బిల్డింగ్ పనులు మొదలుపెట్టారు కూడా. ఐతే ప్రస్తుతం సంఘం దగ్ర రూ.48 లక్షలే ఉన్నాయి. బిల్డింగ్ పూర్తి చేయడానికి రూ.2 కోట్లు కావాలి. ఆ మొత్తంగా అప్పుగా తీసుకొచ్చారు. దీన్ని తీర్చడానికి క్రికెట్ మ్యాచ్ ఆడాలని నిర్ణయించుకున్నారు. రజినీకాంత్,కమల్ హాసన్ సైతం మ్యాచ్ ఆడటానికి సిద్ధమవుతున్నారు. విజయ్, అజిత్ కూడా మ్యాచ్ కు అంగీకారం తెలిపారు. ఏప్రిల్ 10న మ్యాచ్ లకు ముహూర్తం కూడా కుదిరింది. ఆ రోజు రెండు టీం లు ఉండబోతున్నాయి. మరి ఎవరు ఏ జట్టులో ఉంటారో కానీ.. బడా స్టార్లు మ్యాచ్ ఆడితే ఉండే మజాయే వేరు. ఓ మంచి పని కోసం చేపడుతున్న ఈ మ్యాచ్ ద్వారా రూ.2 కోట్ల కంటే ఎక్కువ ఆదాయమే వస్తుందని అంచనా.