ఆమెను ఆడేసుకుంటున్న స్టార్‌ హీరో ఫ్యాన్స్‌

Update: 2018-12-19 09:04 GMT
సౌత్‌ లో హీరోలను ఎక్కువగా అభిమానిస్తూ ఉంటారు. తమ అభిమాన హీరోలను పదే పదే ఆకాశానికి ఎత్తుతూ సోషల్‌ మీడియాలో పోస్ట్‌ లు చేస్తూ ఉంటారు. ఎవరైనా తమ అభిమాన హీరోపై చిన్న విమర్శ చేసినా కూడా తట్టు కోలేరు. ముఖ్యంగా తమిళ హీరోల అభిమానులు కొన్ని సార్లు హద్దులు దాటి మరీ తమ అభిమానంను చూపిస్తూ ఉంటారు. గతంలో పలు సార్లు తమిళనాట స్టార్‌ హీరో ఫ్యాన్స్‌ రచ్చ రచ్చ చేసిన విషయం తెల్సిందే. అజిత్‌, విజయ్‌ ల ఫ్యాన్స్‌ కు ఎప్పుడు కూడా సోషల్‌ మీడియా వేదికగా పెద్ద వివాదం సాగుతూనే ఉంది.

తాజాగా అజిత్‌ అభిమానులు మాజీ హీరోయిన్‌ కస్తూరిని టార్గెట్‌ చేశారు. అజిత్‌ ను ఆయన అభిమానులు పిచ్చిగా అభిమానించడంపై కస్తూరి స్పందిస్తూ వారిని తలైవలి అంటూ సంబోధించింది. అంటే తలనొప్పి అనే అర్థం వస్తుంది. తమ అభిమాన నటుడిని, తమను అవమానించింది అంటూ కస్తూరిని సోషల్‌ మీడియా వేదికగా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తున్నారు. కస్తూరి బహిరంగ క్షమాపణ చెప్పే వరకు ఊరుకునేది లేదని, వెంటనే క్షమాపణ చెప్పకుంటే మాత్రం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు.

కస్తూరికి మద్దతుగా కొందరు సోషల్‌ మీడియాలో అజయ్‌ ఫ్యాన్స్‌ కు వ్యతిరేక ఉద్యమం చేస్తున్నారు. కస్తూరి ఆర్మీ అంటూ ఒక సోషల్‌ మీడియా గ్రూప్‌ ఫామ్‌ అయ్యి అందులో ఆమె అభిమానులు అజిత్‌ ఫ్యాన్స్‌ కు పోస్ట్‌ లు పెడుతున్నారు. డర్టీ అజిత్‌ ఫ్యాన్స్‌ అంటూ సోషల్‌ మీడియాలో ఒక హ్యాష్‌ ట్యాగ్‌ ను పోస్ట్‌ చేస్తున్నారు. ఇప్పుడు ఆ హ్యాష్‌ ట్యాగ్‌ కాస్త వైరల్‌ అయ్యింది. కస్తూరి విషయంలో అజిత్‌ ఫ్యాన్స్‌ వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం సమంజసం కాదని ఎక్కువ శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అజిత్‌ ఎలా రియాక్ట్‌ అవుతాడనే విషయమై అందరిలో ఆసక్తి నెలకొంది.

Tags:    

Similar News