దేశ వ్యాప్తంగా సినీ ప్రియులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో తమిళ సూపర్ స్టార్ అజిత్ నటిస్తున్న `వలిమై` చిత్రం ఒకటి. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో టాలీవుడ్ హీరో కార్తికేయ గుమ్మకొండ విలన్ గా నటిస్తున్నారు. `ఖాకీ`, నేర్కొండ పార్వై` చిత్రాల ఫేమ్ హెచ్ వినోద్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ హాట్ లేడీ హుమా ఖురేషీ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రాన్ని బోనీ కపూర్ నిర్మించారు. ఇటీవల విడుదల చేసిన 2 నిమిషాల 52 సెకన్ ల నిడివిగల ట్రైలర్ సినిమా మెయిన్ ప్లాట్ ఏంటో రివీల్ చేసింది.
అబ్బుర పరిచే బైక్‌రేసింగ్ విన్యాసాలతో పాటు ఛేజింగ్ దృశ్యాలు ప్రేక్షకులకి హాలీవుడ్ మూవీని చూస్తున్న ఫీల్ ని కలిగించాయి. దీంతో ఈ మూవీపై తెలుగు, తమిళ భాషల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా తెలుగు డబ్బింగ్ వెర్షన్ కూ మంచి డిమాండ్ ఏర్పడింది. ఇదిలా వుంటే ఈ మూవీని జనవరి 13న వరల్డ్ వైడ్‌గా భారీ స్థాయిలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే అదే సమయంలో ఒమిక్రాన్, కరోనా వైరస్ థర్డ్ వేవ్ ప్రకంపనలు మొదలయ్యాయి.
దీంతో తమిళనాడు ప్రభుత్వం నైట్ కర్ఫ్యూని విధిస్తున్నట్టుగా ప్రకటించింది. ఇది `వలిమై` చిత్రానికి పెద్ద దెబ్బగా మారుతుందని గమనించిన మేకర్స్ ఈ మూవీ రిలీజ్ ని వాయదా వేస్తున్నట్టుగా ప్రకటించారు. తాజాగా పరిస్థితులు మళ్లీ చిన్న చిన్నగా అదుపులోకి వస్తున్న నేపథ్యంలో ఈ మూవీ రిలీజ్ పై ఓ ఆసక్తికరమైన వార్త బయటికి వచ్చేసింది.
మార్చి నాటికి పరిస్థితులు మారే అవకాశం వుందని గ్రహించిన చిత్ర వర్గాలు ఈ మూవీని మార్చి 4న విడుదల చేయాలని ప్లాన్ చేసుకుంటున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అజిత్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తమ క్రేజీ హీరో సినిమా రిలీజ్ డేట్ వచ్చేసిందంటూ సెలబ్రేషన్స్ మొదలుపెట్టారు. ఈ చిత్రాన్ని ఓటీటీలో కాకుండా వరల్డ్ వైడ్ గా థియేటర్లలో రిలీజ్ చేయాలని భారీ స్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నారు.
`వలీమై` ఓటీటీ రిలీజ్ కోసం దాదాపు 300 కోట్ల వరకు ఓ ప్రముఖ ఓటీటీ దిగ్గజం ఆఫర్ చేసిందట. అయితే ఆ ఆఫర్‌ని `వలిమై` మేకర్ బోనీ కపూర్ సున్నితంగా తిరస్కరించారని, ఈ మూవీని థియేటర్లలోనే రిలీజ్ చేస్తానని ఆయన నిర్ణయించుకోవడంతో ఆ డీల్ కుదరలేదని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. థియేటర్లలో 50 వాతం ఆక్యుపెన్సీ కారణంగా ఈ మూవీని ఓటీటీకే ఇచ్చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రాచారానికి బోనీ కపూర్ ఫుల్ స్టాప్ పెట్టారు.