అత్తారింటికి దారేది.. ఇండస్ట్రీ హిట్టు. ఆ సినిమా విడుదలకు ముందే సగం సినిమాను నెట్లో పెట్టేశారు. బాహుబలి సినిమా ఎంత పెద్ద బ్లాక్ బస్టరో తెలిసిందే. దానికీ లీకేజీ బాధ తప్పలేదు. ఎడిటింగ్ చేయని 12 నిమిషాల వీడియో ఫుటేజీని లీక్ చేసేశారు. అంతంత పెద్ద సినిమాలకూ లీకేజీ బాధలు తప్పలేదు. తాజాగా మరో భారీ సినిమా ఈ లీకేజీ ఉచ్చులో పడింది. ఇంకో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న తమిళ స్టార్ హీరో అజిత్ సినిమా ‘వేదాలం’కు సంబంధించిన కొన్ని సీన్లు లీకైపోయాయి.
ఇందులో హీరో ఇంట్రడక్షన్ సీన్ తో పాటు మరికొన్ని సన్నివేశాలు నెట్ లో లీకైపోయాయి. రెండు రోజులుగా ఈ సీన్లు వాట్సాప్ తో పాటు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఎడిటింగ్ సమయంలో ఎవరో ఆ సీన్లు కాపీ చేసి నెట్లోకి వదిలినట్లు కనిపిస్తోంది. అదృష్టం కొద్దీ అవి చిన్న చిన్న సన్నివేశాలే. కొందరు అజిత్ అభిమానులు ఈ సన్నివేశాలు చూసి ఊగిపోతుంటే.. ఎగ్జైట్మెంట్ మిస్సయిందే అని మిగతా వాళ్లు ఫీలవుతున్నారు. తమిళ నాట పైరసీ, లీకేజీల సమస్య కొంచెం పెద్దదే. సినిమా విడుదలైన తొలి రోజు రాత్రికే ఐదారు వెబ్ సైట్లు సగర్వంగా పైరసీ ప్రింటును నెటిజన్లకు అందిస్తాయి. ఆ సైట్లు చాలా ఫేమస్. అయినా అక్కడి ఇండస్ట్రీ జనాలు ఏమీ చేయలేని పరిస్థితి. కోలీవుడ్ తో పోలిస్తే మన దగ్గర పరిస్థితి కొంచెం బెటరే అని చెప్పాలి.