పూరి జగన్నాథ్ .. పరిచయం అవసరమే లేని పేరు. తన తొలి సినిమాను సెట్స్ పైకి తీసుకుని వెళ్లడానికి ఎంత కష్టపడ్డారో, తన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవుతున్నప్పుడు మరో ప్రాజెక్టును సెట్ చేసుకోవడానికి ఆయన అంతకంటే ఎక్కువ కష్టమే పడ్డారు. పూరికి ఎన్ని ఫ్లాపులు పడినా ఆయన పేరు స్టార్ డైరెక్టర్స్ జాబితాలోనే ఉంటుంది .. అదే ఆయన ప్రత్యేకత. ఇప్పుడంటే పాన్ ఇండియా పేరు చెప్పేసి నిర్మాణ భాగస్వాములు ఆయనను కాస్త కట్టడి చేశారుగానీ, లేదంటే ఆయన ఎంత స్పీడ్ గా సినిమా తీస్తాడనేది అందరికీ తెలుసు.
తన కొడుకును హీరోగా చేయడం కోసం ఆ దారిలో ఉన్న ముళ్లను .. రాళ్లను ఏరేసే ఫాదర్ గా పూరి కనిపించరు. ఆకాశ్ తన కథలను తాను వినవలసిందే .. తన ప్రాజెక్టుల విషయంలో తాను నిర్ణయం తీసుకోవలసిందే. తనంతట తానుగా ఆకాశ్ ఎదగడానికి పూరి దూరంగా ఉండటం ఆయన వ్యక్తిత్వానికి అద్దం పడుతుంది. తండ్రి మనసును అర్థం చేసుకున్న ఆకాశ్, ఆయన పేరును నిలబెడతానంటూ విభిన్నమైన కథలను ఎంచుకుంటూ వస్తున్నాడు. ఆయన తాజా చిత్రమైన 'చోర్ బజార్' ఈ నెల 24వ తేదీన థియేటర్లలో దిగిపోతోంది.
ఒకప్పుడు పూరి ఆర్థికపరమైన ఇబ్బందులు పడుతున్నప్పుడే, భార్యాభర్తలు విడాకులు తీసుకోనున్నారనే ప్రచారం జరిగింది. అందుకు సంబంధించిన ప్రశ్న తాజా ఇంటర్వ్యూలో ఆకాశ్ కి ఎదురు కాగా ఆయన స్పందిస్తూ.. " ఒకానొక సమయంలో పెంపుడు కుక్కలకు కూడా ఫుడ్ పెట్టలేని పరిస్థితుల్లో డాడీ వాటిని ఫ్రెండ్స్ కి ఇచ్చేశారు.
ఆ విషయాలు మాకు చాలా రోజుల వరకూ తెలియకుండా మా అమ్మ చేసింది. ఆ సమయంలో డాడీకి సపోర్టుగా నిలిచింది అమ్మనే. అలాంటి అమ్మానాన్నలు విడాకులు తీసుకోవాలని ఎందుకు అనుకుంటారు?
మా నాన్న నాతో చెప్పిన ఒక విషయం ఈ సందర్భంలో చెబుతాను. మా అమ్మానాన్నలు ప్రేమలో ఉన్నప్పుడు .. ఒకరోజున డాడీ కాల్ చేసి, నిన్ను పెళ్లిచేసుకోవాలని అనుకుంటున్నాను వచ్చేస్తావా? అని అడిగారట.
ప్రస్తుతం నా జేబులో 200 ఉన్నాయి. రేపటి రోజున అవి కూడా ఉంటాయో లేదో తెలియదు అని కూడా అన్నారట. అయినా ఓకే అంటూ అమ్మ వచ్చేసింది. నాన్న అలాంటి పరిస్థితుల్లో ఉన్నాడని తెలిసి కూడా అమ్మ వచ్చేసిందని తెలిసి నా మతిపోయింది. అంత ప్రేమతో ఉన్న అమ్మానాన్నలు ఎందుకు విడిపోతారు? అవన్నీ పుకార్లే" అంటూ చెప్పుకొచ్చాడు.