తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎక్కడ విన్నా 'అఖండ' సినిమాను గురించే మాట్లాడుకుంటున్నారు. బోయపాటి టేకింగ్ .. బాలకృష్ణ యాక్టింగ్ గురించి గొప్పగా చెప్పుకుంటున్నారు. కథాబలంతో పాటు భారీతనం ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది. బాలకృష్ణ పాత్రను ఎంతో పవర్ఫుల్ గా డిజైన్ చేయడం వలన, ఆయనను అన్ని వైపులా నుంచి ఎదుర్కోవడానికి ఎంతో మంది చిన్నా పెద్ద విలన్లు అవసరమయ్యారు. అలాంటి ఒక పాత్రలోనే ఈ సినిమాలో శ్రవణ్ కనిపించాడు. నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలలో .. విలన్ గ్యాంగ్ లో ఎక్కువగా కనిపిస్తూ వచ్చిన శ్రవణ్, ఇంతవరకూ 100 సినిమాలకి పైగా చేశాడు.
తాజా ఇంటర్వ్యూలో శ్రవణ్ మాట్లాడుతూ .. 'అఖండ' సినిమాలో బాలకృష్ణ చెప్పిన ఒక పవర్ఫుల్ డైలాగ్ ను తనదైన స్టైల్లో చెప్పాడు. ఆ సినిమాలో విలన్ గ్యాంగ్ పై బాలకృష్ణ విరుచుకుపడే సీన్లో శ్రవణ్ ఇన్వాల్వ్ అవుతూ ఒక్కసారిగా యాంకర్ పైకి దూసుకొచ్చాడు. 'అఖండ' సీన్స్ అంతగా ప్రభావం చూపుతాయని చెబుతూ నవ్వేశాడు. ఆ తరువాత ఈ సినిమాతో పాటు తన జర్నీకి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు. " బాలకృష్ణతో చేస్తుంటే ఏ ఆర్టిస్టుకైనా ఒక ఊపు వచ్చేస్తుంది. ఆ మేజిక్ ఆయనలో ఉంది .. ఆయనతో 'సింహా' .. 'లెజెండ్' సినిమాలు చేయడం వలన ఆ విషయం నాకు తెలుసు.
మొదటి నుంచి కూడా బోయపాటిగారు నాకు చాలా పవర్ఫుల్ పాత్రలనిస్తూ వచ్చారు. ఆయన దర్శకత్వంలో మొదటిసారి నేను 'తులసి' చేశాను. ఆ సినిమాలో వెంకటేశ్ లాంటి పెద్ద హీరో కాంబినేషన్లో .. హెవీ క్రౌడ్ లో కర్నూల్ ఎపిసోడ్ చేయవలసి వచ్చింది. చేయగలనో లేదోనని బోయపాటిగారు టెన్షన్ పడ్డారు. కానీ నాపై నాకు గల నమ్మకంతో ఆ సీన్ చేశాను .. అది నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. అప్పటి నుంచి బోయపాటి గారు తన ప్రతి సినిమాలో నాకు ఒక ముఖ్యమైన పాత్రను ఇస్తూ వస్తున్నారు. అందువల్లనే నన్ను అంతా బోయపాటి శ్రవణ్ అని పిలుస్తున్నారు.
'అఖండ'కి సీక్వెల్ కూడా ఉంది .. కాకపోతే కొంత సమయం పడుతుంది. ఎందుకంటే ఇటు బాలకృష్ణగారికి .. అటు బోయపాటిగారికి ఇద్దరికే కూడా వేరే కమిట్మెంట్స్ ఉన్నాయి. ఆ ప్రాజెక్టులు పూర్తయిన తరువాత సీక్వెల్ ఉంటుంది. ఇప్పుడున్న అఘోర స్థాయిని మించి ఆ సినిమా ఉండాలి. ఇంతవరకూ నేను నెగెటివ్ షేడ్స్ కలిగిన పాత్రలనే ఎక్కువగా చేస్తూ వచ్చాను. అలాంటివే నాకు ఎక్కువ పేరును తెచ్చిపెట్టాయి. ఇకపై కూడా అలాంటి పాత్రలనే చేయాలని అనుకుంటున్నాను" అంటూ చెప్పుకొచ్చాడు.