అఖండ సంచ‌ల‌నం.. శాత‌క‌ర్ణి-వ‌కీల్ సాబ్ రికార్డులు బ్రేక్

Update: 2021-12-03 06:20 GMT
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ మాస్ ప‌వ‌ర్ ఎంతో మ‌రోసారి ప్రూవ్ అయ్యింది. బాక్సాఫీస్ వ‌ద్ద అఖండ ఓపెనింగ్ డే స‌రికొత్త రికార్డుల‌ను అందుకుంటోంది. ఈ చిత్రం గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి.. వ‌కీల్ సాబ్ ల యుఎస్ రికార్డుల‌ను సైతం బ్రేక్ చేసింద‌నేది ట్రేడ్ రిపోర్ట్.

మాస్ జాతరకు అసలైన అర్థం చూపిస్తూ బాక్సాఫీస్ దగ్గర బాల‌య్య స‌త్తా చాటుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ సినిమా రికార్డు ఓపెనింగ్స్ తెచ్చుకుంది. ట్రేడ్ పండితుల లెక్కలు ప్రకారం తెలుగు రాష్ట్రాల్లోనే భారీ షేర్ వ‌సూలు చేసింది. అఖండ డే1  తెలుగు రాష్ట్రాల్లో అద్భుతమైన ఓపెనింగ్స్ సాధించింది. 14.60 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసింది. గౌతమీపుత్ర శాతకర్ణి (ఇది 9.76 కోట్లు వసూలు చేసింది)ని వెన‌క్కి నెట్టేస్తూ.. NBK చిత్రం సాధించిన అత్యధిక ఓపెనింగ్స్ ఇదే. కోస్తా ఆంధ్రాలో 4 షోల ఆంక్షల వల్ల సినిమా దెబ్బతింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం తెలుగు రాష్ట్రాల్లో 49 కోట్లు వసూలు చేయాల్సి ఉంది.  ప్రాంతాల వారీగా డే1 షేర్లు
ప‌రిశీలిస్తే.. #అఖండ AP/TS షేర్లు ఇలా ఉన్నాయి.

నైజాం : 4.37 కోట్లు-సీడెడ్ : 3.25 కోట్లు-UA: 1.39 కోట్లు- గుంటూరు : 1.87 కోట్లు- తూర్పు : 1.05 కోట్లు- వెస్ట్: 0.94 కోట్లు-కృష్ణా : 0.81 కోట్లు-
నెల్లూరు : 0.93 కోట్లు క‌లుపుకుని ఓవ‌రాల్ గా 14.61 కోట్లు వ‌సూలైంది. #GPSK (9.76 కోట్లు)ని అధిగమించిన NBKకి ఇప్పటివరకు అత్యధిక ఓపెనింగ్ ల‌ను సాధించాడు. సెకండ్ వేవ్ అనంత‌రం తెలుగు సినిమాకి అత్యధిక ఓపెనింగ్ ఇదే.

అమెరికాలోనూ రికార్డులు

అమెరికాలో వకీల్ సాబ్ రికార్డులను అఖండ అధిగ‌మించింది.  నార్త్ అమెరికాలో బాలయ్య హ‌వా సాగింది. అఖండ సినిమాకు ప్రీమియర్స్ నుంచే 3.25 లక్షల డాలర్లు (దాదాపు 2.75 కోట్లు) వ‌సూలు కాగా..బాలయ్య కెరీర్ మూడో బెస్ట్ ఓపెనింగ్ ల‌తో అఖండ స‌త్తా చాటింది. ఎన్టీఆర్ కథానాయకుడు -3.74 లక్షల డాలర్లు.. గౌతమీపుత్ర శాతకర్ణి 3.50 లక్షల డాలర్లు వ‌సూలైంది. ఇప్పుడు అఖండ మూడో స్థానం ద‌క్కించుకుంది.

ఇంత‌కుముందు అమెరికాలో వకీల్ సాబ్ 3 లక్షల డాలర్లు వసూలు చేయ‌గా.. నాగ చైతన్య- క‌మ్ముల లవ్ స్టోరీ 3.13 లక్షల డాలర్ల‌ను వసూలు చేసింది. ఈ రెండిటి రికార్డుల‌ను అఖండ బ్రేక్ చేసింది. ఇంటా బ‌య‌టా అఖండ వ‌సూళ్ల హ‌వా కొన‌సాగుతోంది. అమెరికాలో బాల‌కృష్ణ ఫ్యాన్స్ ర‌చ్చ గురించి తెలిసిందే.
Tags:    

Similar News