అఖిల్ కి మళ్లీ కొత్త డేట్ ఫిక్స్.. ఈసారైనా?

Update: 2022-12-26 10:14 GMT
అఖిల్ అక్కినేని హీరోగా హీరోగా రూపొందిన ఏజెంట్‌ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందిన విషయం తెల్సిందే. ఈ సంక్రాంతికి ఏజెంట్ సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా నిన్న మొన్నటి వరకు ప్రచారం చేశారు. కానీ చిరంజీవి మరియు బాలకృష్ణ సినిమాలు సంక్రాంతికి విడుదల కాబోతున్న నేపథ్యంలో ఏజెంట్‌ సినిమాను వాయిదా వేస్తున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన ఏజెంట్‌ సినిమా కొత్త విడుదల తేదీని ప్రకటించారు. ఏజెంట్‌ సినిమా యొక్క విడుదల తేదీ పై గత కొన్ని రోజులుగా జరుగుతున్న చర్చకు ఫుల్‌ స్టాప్ పడబోతుంది. ఏజెంట్‌ సినిమాను సంక్రాంతి సీజన్ తర్వాత ఫిబ్రవరిలో విడుదల చేయబోతున్నట్లుగా తెలుస్తోంది.

సాదారణంగా తెలుగు సినిమాలు ఫిబ్రవరి మరియు మార్చి లో విడుదల అవ్వవు. ఆ రెండు నెలలు కూడా సినిమా పరిశ్రమకు అన్‌ సీజన్ అనుకుంటారు. అందుకే పెద్ద సినిమాలు.. చిన్న సినిమాలు ఆ రెండు నెలల్లో విడుదల అవ్వడం చాలా తక్కువ. అయినా కూడా కంటెంట్ పై నమ్మకంతో అఖిల్ ఏజెంట్‌ ను ఫిబ్రవరిలో విడుదల చేయాలని భావిస్తున్నారట.

ఏకే ఎంటర్‌ టైన్‌మెంట్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ సినిమాలో కీలక పాత్రను మలయాళ మెగాస్టార్‌ మమ్ముట్టీ చేస్తూ ఉండగా.. హీరోయిన్ గా సాక్షి వైద్య నటిస్తోంది. అఖిల్‌ లుక్‌ కు ఇప్పటికే ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. హాలీవుడ్‌ రేంజ్ యాక్షన్ థ్రిల్లర్ సన్నివేశాలు ఈ సినిమాలో చూపించబోతున్నట్లుగా మేకర్స్ నమ్మకంగా చెబుతున్నారు. అఖిల్‌ కొత్త సినిమా విడుదల తేదీ మరింత స్పష్టంగా ఒకటి రెండు వారంలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News