టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ హీరో అక్కినేని అఖిల్. తాను నటించిన 4వ చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ గతేడాది వేసవి నుండి రిలీజ్ అవ్వడానికి అవస్థలు పడుతోంది. ఫస్ట్ టైం అఖిల్ సరసన పూజాహెగ్డే నటించగా.. బొమ్మరిల్లు భాస్కర్ సినిమాను తెరకెక్కించాడు. స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు, వాసువర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. నిజానికి ఈ మూవీని 2020 శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 2న రిలీజ్ చేయాలనుకున్నారు. అప్పుడు కరోనా ఫస్ట్ వేవ్ బ్రేక్ వేసింది. అలాగే కాస్త షూటింగ్ కూడా మిగిలిపోయింది. ఆ తర్వాత దసరాకు ప్లాన్ చేశారు. కానీ లాక్‌డౌన్ కారణంగా షూటింగ్స్ జరగకపోవడంతో విడుదలను 2021 జనవరికి వాయిదా వేశారు.
అయితే జనవరిలో కూడా కష్టమే అనిపించడంతో మళ్లీ ఏప్రిల్ అనుకున్నారు. కానీ చివరిగా అందరికి షాకిస్తూ జూన్ 19న విడుదల అని అధికారికంగా ఫిబ్రవరిలో ప్రకటించారు. అంటే 2020 ఏప్రిల్ అనుకున్న సినిమా 14నెలలు వాయిదాపడి 2021 జూన్ లో ప్లాన్ చేశారు. ఓకే అంతా బాగానే ఉందనుకుంటే.. ఇంతలో కరోనా సెకండ్ వేవ్ మొదలైంది. సమ్మర్ లో ప్లాన్ చేసిన సినిమాలన్ని వాయిదా బాటపట్టాయి. ప్రస్తుతం పరిస్థితి చూస్తుంటే బ్యాచిలర్ బాబు జూన్ 19న కూడా వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. అసలే థియేటర్స్ అంతంత మాత్రంగా 50% సీటింగ్ తో నడుస్తున్నాయి. జూన్ లోపు పూర్తిగా మూసినా ఆశ్చర్యపోయే అవసరం లేదు. మరి మొదటి నుండి హిట్ అనేది ఎరుగని బ్యాచిలర్ ఈసారైనా హిట్టు కొడతాడేమో చూడాలి. విశేషం ఏంటంటే.. ఓవైపు అఖిల్ ఐదవ సినిమాకు కూడా సన్నాహాలు సిద్ధం అవుతున్నాయి.