అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూసిన అఖిల్ 2015వ సంవత్సరంలో వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖిల్' చిత్రంతో ఎంట్రీ ఇచ్చాడు. మొదటి సినిమా ఫ్లాప్ అవ్వడంతో రెండవ సినిమాకు దాదాపు రెండేళ్లు సమయం తీసుకున్నాడు. 2017లో హలోతో వచ్చాడు హలో కూడా అఖిల్ కు హిట్ ఇవ్వలేక పోయింది. అఖిల్ మూడవ సినిమాకు కూడా మళ్లీ రెండేళ్లు గ్యాప్ వచ్చింది. 2019లో 'మిస్టర్ మజ్ను' వచ్చింది. ఇక తన నాల్గవ సినిమాకు ఎక్కువ గ్యాప్ రావద్దనే ఉద్దేశ్యంతో వచ్చే ఏడాదిలోనే తన ప్రస్తుత సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.
అఖిల్ నాల్గవ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్న విషయం తెల్సిందే. వచ్చే ఏడాది ప్రథమార్థంలోనే ఆ చిత్రం రాబోతుంది. ఆ సినిమా ఫలితాన్ని పట్టించుకోకుండా వెంటనే 5వ సినిమాను కూడా ప్రారంభించాలని అఖిల్ భావిస్తున్నాడు. అఖిల్ అయిదవ సినిమాకు తమిళ దర్శకుడు మిత్రన్ దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయి. ఇటీవలే తమిళ హీరో శివ కార్తికేయన్ మరియు మిత్రన్ లతో అఖిల్ భేటీ అయ్యాడు.
ఆ ఇద్దరితో పలు సార్లు భేటీ అయిన అఖిల్ స్క్రిప్ట్ చర్చలు జరిపినట్లుగా సమాచారం. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మరో రెండు నెలల్లో పూర్తి అయ్యే అవకాశం ఉంది. ఆ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే లేదంటే షూటింగ్ పూర్తి కాకముందే తన అయిదవ సినిమాను మిత్రన్ దర్శకత్వంలో ప్రారంభించాలని అఖిల్ భావిస్తున్నాడట. అందుకోసం చకచక ఏర్పాట్లు జరుగుతున్నాయట. కెరీర్ ఆరంభించి అయిదేళ్లు కావస్తున్నా ఇప్పటి వరకు నాలుగు సినిమాలే చేసిన అఖిల్ ఇకపై సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకోవాలనే నిర్ణయానికి వచ్చాడట. అందుకే అయిదవ సినిమా విషయంలో అప్పుడే హడావుడి మొదలైంది.