అఖిల్ 3వ సినిమా.. కొరటాలతో?

Update: 2017-11-27 17:18 GMT
హీరో కొడుకులకు ఈ రోజుల్లో స్టార్ డమ్ తో హిట్లు ఏ మాత్రం రావడం లేవు. స్టార్ హోదా కన్నా సినిమాలో కంటెంట్ ఉంటేనే జనాలు ఇష్టపడుతున్నారు. ఇది ప్రస్తుతం అందరికి తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు అఖిల్ అక్కినేని కూడా అదే తరహాలో ఆలోచిస్తున్నాడు. మంచి కథను ఎంచుకొని తన అసలు టాలెంట్ ని నిరూపించుకోవాలని చూస్తున్నాడు. మొదటి సినిమాతో ప్రేక్షకులను ఏ స్థాయిలో నిరాశపరిచాడో మళ్లీ ఆ స్థాయిలో అపజయం పై రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నాడు.

అయితే ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న హలో సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో ఎవరికీ తెలియదు. ప్రేక్షకులకు అనుకున్నట్టుగా కొత్తధనం అందిస్తేనే బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ జరగవచ్చు. అయితే ఆ తర్వాత అఖిల్ ఏ దర్శకుడితో సినిమా చేస్తాడు అనేది ప్రస్తుతం టాలీవుడ్ లో జరుగుతోన్న చర్చ. కొన్ని కథలను అనుకుంటున్నా ఇంకా నాగ్ వాటిని ఫైనల్ చేయకుండా వెయిటింగ్ లిస్ట్ లో పెట్టారంట. ఇక అసలు విషయానికి వస్తే.. అఖిల్ త్వరలో.. తన 3వ సినిమాను.. కొరటాల శివ దర్శకత్వంలో నటించబోతున్నాడని తెలుస్తోంది.

కొరటాల ప్రస్తుతం అఖిల్ పై ఓ కన్నేసి ఉంచాడట. అతని బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఒక కథ చేయాలనీ డిసైడ్ అయినట్లు ఆయన నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం కొరటాల.. మహేష్ బాబుతో భరత్ అనే నేను సినిమాను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఆ సినిమా అయిపోగానే కొరటాల రామ్ చరబ్ - అల్లు అర్జున్ తో చెయ్యాలని డిసైడ్ అయ్యాడు. వారిద్దరితో చేసిన తర్వాత సోషల్ ఎలిమెంట్స్ ఉండే కథలో అఖిల్ ని చూపించేందుకు కొరటాలకు రెడీ అవుతున్నారని సమాచారం.       
Tags:    

Similar News