డిసెంబర్ 22న తన చిన్నొకొడుకును మరోసారి లాంచ్ చేస్తున్నారు అక్కినేని నాగార్జున. ''హల్లో'' అంటూ విక్రమ్ కె కుమార్ డైరక్షన్లో రూపొందిన ఒక సింపుల్ లవ్ స్టోరీలో అఖిల్ అక్కినేనిని రీలాంచ్ చేస్తున్నారు. ఇంతకీ ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్లు కాస్త గట్టిగానే ఉన్నాయి.. అలాగే దర్శకుడు విక్రమ్ అవసరమైతే పెదాల ముద్దులు కూడా పెట్టిస్తాడు.. ఇంతకీ సెన్సార్ వారు సినిమాఉ చూసి ఏమంటున్నారు?
ఈరోజు ఉదయం సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న హలో సినిమాకు ''యు'' సర్టిఫికేట్ వచ్చింది. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ ఎన్ని ఉన్నా.. ఏ రేంజు ఫైటింగులు ఉన్నా కూడా.. సినిమాలో ఒక స్పైడర్ మ్యాన్ సినిమా తరహాలో ఒక్క చిన్న రక్తపు చుక్క కూడా చూపించలేదట. అలాగే అఖిల్ అండ్ కళ్యాణ్ ప్రియదర్శన్ మధ్యనే సీన్లన్నీ విపరీతమైన ప్రేమ తాలూకు కెమిస్ర్టీతో ఉన్నాయే తప్పించి.. రొమాన్స్ అంటూ హద్దులు దాటేయలేదంట. అందుకే ఈ సినిమాకు అసలు కట్లు కూడా లేకుండా.. యు చేతిలోపెట్టారు అంటున్నారు సన్నిహితులు.
ఇకపోతే సినిమా మొత్తం చాలా ఇంటెలిజెంట్ గా ఉందని ఒక టాక్ వినిపిస్తోంది. అలాగే అనూప్ రూబెన్స్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగుందట. సినిమా అంతా తన స్ర్కీన్ ప్లేతో విక్రమ్ బాగా ఆకట్టుకున్నాడని అంటున్నారు. లెటజ్ సీ.