నా వల్ల కాదంటూ నాగ్ కి అఖిల్ లెటర్

Update: 2015-11-20 04:13 GMT
చేస్తున్న పని మీద ఒకోసారి విసుగు - విరక్తి వస్తుంటుంది. అది మనకు ఫ్యూచర్ లో ఎలాంటి ఉపయోగం లేనిది అని అర్ధమైతే.. ఇక ఒక నిమిషం కూడా ఆ పనిలో ఉండలేం. సరిగా ఇలాంటి పరిస్థితే ఎదురైంది అక్కినేని అఖిల్ కి. అందుకే తన ఫీలింగ్స్ ని వివరిస్తతూ.. వెంటనే తండ్రి నాగార్జునకి ఓ పెద్ద ఎక్స్ ప్లెనేషన్ లెటర్ రాసేశాడు. దాని సారాంశం.. ఇక వదిలేస్తా - నా వల్ల కాదు - విసుగొచ్చేసింది.. అనే.

ఈ లెటర్ విషయాన్ని నాగ్ స్వయంగానే చెప్పాడు. కాకపోతే.. ఇప్పుడు కాదు కొన్నేళ్లక్రితం జరిగిన సంఘటన ఇది. అప్పట్లో అఖిల్ అమెరికాలో ఉండేవాడు. అక్కడ ప్లస్ టూ తర్వాత బీబీఎం చదువుతున్న రోజులవి. అఖిల్ ఆ కోర్స్ చేస్తున్నపుడు నాగార్జునకి కొడుకు నుంచి లేఖ వచ్చింది. ఇది నాకు ఎలాగూ ఉపయోగపడదు కాబట్టి, చేయడం ఇంట్రెస్ట్ లేదని అఖిల్ రాసుకొచ్చాడు. దాన్ని మొత్తం చదివిన నాగ్ ఎలాంటి సలహా మాత్రం ఇవ్వలేదట. నిర్ణయం సొంతగానే తీసుకోమని ప్రోత్సహిద్దాం అని భావించాడట నాగ్. కానీ అప్పటికే అఖిల్ ఓ డెసిషన్ కూడా తీసేసుకున్నాడట లెండి..

అదే యూఎస్ లోనే ఉండి, ఏడాది పాటు యాక్టింగ్ కోర్స్ చేయడం. అది పూర్తయ్యాక ఇండియా వచ్చి డ్యాన్సులు, ఫైట్లు నేర్చేసుకున్నాడట. ఆ వెంటనే బ్యాంకాక్ వెళ్లిపోయి మార్షల్ ఆర్ట్స్ లో కూడా శిక్షణ పొందాడట అఖిల్. ఆ తర్వాత ఏడాదిన్నర పాటు కష్టపడి స్క్రిప్ట్ ఫైనల్ చేసినట్లు చెప్పుకొచ్చాడు నాగ్. అర్ధమైందిగా.. అదీ అఖిల్ అరంగేట్ర కథ. 
Tags:    

Similar News