మామూలుగా ఫ్లాపు సినిమాను సూపర్ హిట్ అంటూ ప్రచారం చేసుకునే రోజులివి. కాని కొంతమంది హీరోలు మాత్రం హిట్టు సినిమా తీసినా కూడా దాని గురించి పెద్దగా మాట్టాడడానికి ఇష్టపడరు. ఇకపోతే ఇప్పుడు అక్కినేని యువకిశోరం ఏ క్యాటగిరీకి చెందుతాడో వేరే చెప్పక్కర్లేదు. తన మాటలకంటే తన పని గట్టిగా మాట్లాడాలని అనుకుంటాడు అఖిల్. కాకపోతే మనోడు సైలెంటుగా ఉండటం ఏమీ బాగాలేదు అంటున్నారు అభిమానులు.
దీపావళి సందర్భంగా నిన్న విడుదలైన 'అఖిల్' సినిమాకు.. రావడం రావడమే మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొంతమంది క్రిటిక్స్ సినిమా పర్లేదు అనిపిస్తే.. కొందరికి నచ్చలేదు. అయితే అందరికీ అఖిల్ వేసిన డ్యాన్సులు నచ్చాయి. యాక్టింగ్ పరంగా ఇంప్రూవ్ అవ్వాలి అనే కామెంట్ ఓ అరడజను సినిమాల వరకు వినిపిస్తూనే ఉంటుంది కాబట్టి.. దాని గురించి పెద్దగా పట్టించుకోవక్కర్లేదేమో. కాని డ్యాన్సులు బాగున్నాయని అందరూ పొగుడుతున్నారుగా.. మరి ఆ విషయంలోనైనా కనీసం అఖిల్ రెస్పాండ్ అవ్వట్లేదేంటి?
నిన్నమార్నింగ్ తన హీరోయిన్ తో కలసి ఆర్టీసి క్రాస్ రోడ్స్ దగ్గర స్పెషల్ షో చూసిన తరువాత నుండి అసలు అఖిల్ తన సోషల్ నెట్ వర్కులోనే కనపించట్లేదు. సినిమాపై క్రిటిక్స్ - ఆడియన్స్ - ఫ్రెండ్స్.. ఇలా అందరూ ఇచ్చిన వర్డిక్ట్ ను తీసుకొని తదుపరి సినిమాపై మరింత ఫోకస్ పెడుతున్నారో.. లేకపోతే డ్యాన్సులు నచ్చినందుకు థ్యాంక్సనో.. ఏదో ఒకటి చెప్పాలిగా అబ్బాయా?? రా.. ట్విట్టర్ లోకి రా!!