హీరోగా తొలి సినిమా చేయకముందే టైటాన్ - మౌంటైన్ డ్యూ యాడ్స్ చేసి.. దేశవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించాడు అక్కినేని అఖిల్. ముఖ్యంగా ‘టైటాన్’ యాడ్ లో కల్కి కొచ్చర్ తో రొమాన్స్ అల్లుకుపోయిన తీరు చూస్తే.. బాలీవుడ్ సినిమాలకు బాబు బాగానే సూటవుతాడన్న ఫీలింగ్ కలిగింది జనాలకు. తండ్రి ఎలాగూ బాలీవుడ్ లో జెండా ఎగరేసిన వాడే కాబట్టి.. అఖిల్ కూడా హిందీ మీద కన్నేసే ఉంటాడు. ఐతే అందుకోసం ఎంతో కాలం ఎదురు చూడాల్సిన అవసరం లేకుండా ఇప్పటికే బాలీవుడ్ నుంచి అవకాశాలు వస్తున్నాయట కుర్రాడికి. ఇప్పటికే ఓ బాలీవుడ్ సినిమా కోసం తనను అడిగారని.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయని.. త్వరలో వివరాలు వెల్లడిస్తానని చెప్పాడు అఖిల్. ఐతే తన ప్రయారిటీ మాత్రం తెలుగు సినిమాలకే అని చెప్పాడు.
ఇక అఖిల్ సినిమా విశేషాల గురించి చెబుతూ.. అభిమానుల్ని అలరించే చాలా అంశాలు ఇందులో ఉన్నాయని అన్నాడు. గ్రాఫిక్ వర్క్ కోసం సినిమాను వాయిదా వేయడం వంద శాతం సరైన నిర్ణయమే అని.. మళ్లీ వర్క్ చేశాక ఆ సన్నివేశాలు చాలా బాగా వచ్చాయని అఖిల్ చెప్పాడు. చిరుతతో ఫైట్ - ఫ్లయిట్ సీక్వెన్స్ లో గ్రాఫిక్స్ కోసమే సినిమా వాయిదా వేశామన్నాడు. సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ హైలైట్ అని.. ముఖ్యంగా ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఫైట్ అద్భుతంగా వచ్చిందని.. స్పెయిన్ లో అదిరిపోయే లొకేషన్ లలో ఈ సీక్వెన్స్ షూట్ చేశామని చెప్పాడు.