అక్కినేని నాగార్జున రెండో నటవారసుడు అఖిల్ రీ లాంచ్ సినిమా హలో రిలీజ్ కు సమయం దగ్గర పడుతోంది. ఇందులో భాగంగా ఈ మధ్యనే టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ బాగుందని... సినిమాపై బజ్ పెంచేలా ఉందని మంచి కామెంట్లే వచ్చాయి. కాపీరైట్స్ ఉల్లంఘించారంటూ ఈ సినిమా టీజర్ ను యూ ట్యూబ్ తొలగించింది. ఫిన్లాండ్ కు చెందిన ఓ కంపెనీ రూపొందించిన ఎక్సో సూట్ మ్యూజిక్ ను వాడుకుని డబ్బులు చెల్లించకోవడంతో వాళ్లు కాపీరైట్ క్లెయిమ్ చేశారని.. దీంతో టీజర్ ను యూట్యూబ్ నుంచి తీసేశారని తెలిసింది.
దీనిపై ఆ సినిమా హీరో అఖిల్ మాత్రం అలాంటిదేం లేదని అంటున్నాడు. హలో టీజర్ పై ఫాల్స్ కాపీ రైట్ క్లెయిమ్ చేశారంటూ ట్విట్టర్ లో ఓ పోస్టింగ్ పెట్టాడు. హలో సినిమా రూపొందింది అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పైనే. సినిమా నిర్మాతలుగా ఈ విషయంలో క్లారిటీ ఇస్తున్నామని ఆ పోస్టింగులో పెట్టాడు. ఈ టీజర్ మ్యూజిక్ కు సంబంధించి రియల్లీ స్లో మోషన్ తో తాము కొలాబరేషన్ పెట్టుకున్నామని అంటున్నాడు. సరైన కారణం లేకుండా అనవసరమైన గలాటా సృష్టిస్తున్నారంటూ ఒకింత ఆవేదన వ్యక్తం చేశాడు.
అక్కినేని ఫ్యామిలీ కలకాలం గుర్తుంచుకోదగిన హిట్ అందించిన మనం సినిమా డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ హలో సినిమాను డైరెక్ట్ చేశాడు. మనం సినిమాకు మ్యూజిక్ అందించిన అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు పని చేశాడు. అవ్వాల్సిన రభస అంతా అయ్యాక టీజర్ మ్యూజిక్ చౌర్యం చేసింది కాదని ఇప్పుడు అఖిల్ క్లారిటీ ఇస్తున్నా అభిమానులు మాత్రం ఈ సంగతి పక్కనెట్టి కాస్త పాటల రిలీజ్ పని చూడమంటూ సలహాలిస్తున్నారు.