అన్నకు ఫ్లాపు.. మరి తమ్ముడికి?

Update: 2015-12-22 04:10 GMT
అక్కినేని అఖిల్ ప్రస్తుతం నాలుగు రోడ్ల కూడలి మధ్య నిలుచుండిపోయాడు. తొలి చిత్ర పరాభవానికి పూర్తి భాద్యత తానే అని దర్శకుడు వినాయక్ ప్రకటించినా తదుపరి సినిమా ఎటువంటి చెయ్యాలో తోచని స్థితిలో అఖిల్ వున్నాడు.

చరణ్ లా చెయ్యడానికి జక్కన్నకి ఖాళీలేదు. చైతూ బాటలో నడవడానికి గౌతం మీనన్ కి తీరిక లేదు. త్రివిక్రమ్ - సుకుమార్ ల ఆప్షన్ లు పరిశీలించినా ప్రస్తుతానికి వారితో లాభంలేదు. కాబట్టి దేవ కట్టాతో ఒక సినిమా చేయనున్నట్టు సమాచారం.

ఆటోనగర్ సూర్య - డైనమైట్ లు ఫ్లాపులుగా నిలిచినా దేవ కట్టా రైటింగ్ మీద వున్న నమ్మకంతో అఖిల్ అతనికో అవకాశం ఇచ్చినట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ గనుక సక్సెస్ అయితే ఒకే గానీ కాస్త అటు ఇటు అయితే అఖిల్ సెలెక్షన్ పై ఒకసారి దృష్టిపెట్టాల్సిందే.
Tags:    

Similar News