అక్కినేని అమ‌ల స్వీట్స్ క‌హానీ!

Update: 2022-09-10 12:51 GMT
సీనియ‌ర్ న‌టి..నాగార్జున స‌తీమ‌ణి అక్కినేని అమ‌ల కెరీర్ జ‌ర్నీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. దాదాపు అన్ని భాష‌ల్లోనూ అమ‌ల సినిమాలు చేసారు. త‌మిళం..క‌న్న‌డం..తెలుగు..హిందీ భాష‌ల్లో న‌టించి న‌టిగా త‌న‌కంటూ ప్రత్యేక స్థానం ఏర్ప‌రుచుకున్నారు. నాగార్జున‌తో వివాహం త‌ర్వాత అమ‌ల పూర్తిగా సినిమాల‌కు దూర‌మ‌య్యారు.

అయినా అప్పుడ‌ప్పుడు త‌న ఫ్యాష‌న్ ని చాటుకుంటూనే ఉన్నారు. భాష‌తో సంబంధం లేకుండా మంచి రోల్ వ‌స్తే న‌టిస్తున్నారు. ఇటీవ‌లే యంగ్ హీరో శర్వానంద్ క‌థానాయకుడిగా  న‌టించిన   'ఒకే ఒక జీవితం' హీరో త‌ల్లి పాత్ర‌లో అమ‌ల న‌టించి విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లందుకున్నారు. సినిమాకి మంచి రివ్యూల‌తో పాటు ప్రేక్ష‌కుల ఆద‌ర‌ణ‌కు నోచుకుంది.

చాలా కాలం త‌ర్వాత అమ‌ల‌కి వ‌చ్చిన స‌క్సెస్ ఇది.  కొన్నాళ్ల పాటు గుర్తిండిపోయే పాత్ర‌లో ఆమ‌ల అభిన‌యించిన తీరుకు అంతా పిదా అవుతున్నారు. అయితే ఈసినిమా షూటింగ్ స‌మ‌యంలో అమ‌ల టీమ్ మొత్తానికి స్వీట్స్ చేసిన‌ట్లు ప్ర‌చారం సాగింది. ఇది నిజంగా జ‌రిగిందా?  లేదా? అని చాలా మందికి సందేహం. ఈ నేప‌థ్యంలో ఆ సందేహాల‌న్నింటిని అమ‌ల నివృత్తి చేసారు.

వంట చేయ‌డం రాక‌పోయినా  స్వీట్స్ చేసి అంద‌రికీ వడ్డించిన‌ట్లు చెప్పుకొచ్చారు. '' సినిమాలో నేను తల్లి పాత్ర పోషిస్తున్నాను. ఒక రోజు మా నువ్వు మా కోసం వండుతావా? అని అడిగిన‌ప్పుడు  ఏం చెప్పాలో తోచలేదు. నాకు వండడం తెలియదని వాళ్లకు ఎలా చెప్పగలను? అందుకే మనస్పూర్తిగా  స్వీట్స్  చేశాను.  సిబ్బంది అంతా ఓరోజు మా ఇంటికి వచ్చి మొత్తం తిన్నారు. ఆ స‌మయంలో మౌనంగా తిన్నారు. మ‌రి వాటి రుచి ఎలా ఉంది? అన్న‌ది వారినే అడ‌గ‌లాని చ‌మ‌త్క‌రించారు.

అలాగే ఈ సినిమా త‌మిళ వెర్ష‌న్ డ‌బ్బింగ్ చెప్పి అమ‌ల అంద‌ర్నీ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. చిత్ర ద‌ర్శ‌కుడు శ్రీకార్తిక సైతం షాక్ అయ్యారు. ఆ విష‌యాన్ని అమ‌ల రివీల్ చేసారు. 'నేను డైలాగ్‌గా ఇస్తే తమిళం బాగా మాట్లాడగలను. కానీ  సాధారణంగా మాట్లాడేటప్పుడు ఇంగ్లీషులో ఆలోచించి పదం పదం తమిళంలోకి అనువదిస్తాను. అప్పుడు నెమ్మదిగా అనిపిస్తుంది.

ఇప్పుడు తెలుగు బాగా మాట్లాడుతాను. ఇప్పుడు త‌మిళ్ మాట్లాడితే అందులో తెలుగు ప‌దాలొస్తాయి.  కానీ ఈ సినిమా  డబ్బింగ్ చేస్తున్నప్పుడు శ్రీ కార్తీక్ ఆశ్చర్యపోయాడు. త‌మిళం మాట్లాడ‌టం...తెలుగు కంటే సుల‌భం'' అని చెప్పుకొచ్చారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News