మొత్తానికి కొన్నేళ్ల తరువాత రామ్ గోపాల్ వర్మ - నాగార్జున కలయికలో ఒక సినిమా వచ్చింది. జూన్ 1న అంటే ఈ రోజు చరిత్ర సృష్టించిన కాంబినేషన్ లో తెరకెక్కిన ఆఫీసర్ సినిమా విడుదల అయ్యింది. కాంట్రవర్షియల్ కథలుగా కాకుండా ఒక హీరోయిజం ఉన్న సినిమా చేశాను అని వర్మ ముందు నుంచి చెబుతూనే ఉన్నాడు. అలాగే నాగార్జున కూడా చెప్పాడు. ఇక సినిమా కోసం వర్మ ఎమోషనల్ అవ్వడం ఈ మధ్య కాలంలో జరిగిన ఒక వింత.
ఆ సంగతి అటుంచితే.. ఆఫీసర్ సినిమాకు ప్రస్తుతం సోషల్ మీడియాలలో రివ్యూలు గట్టిగా అందుతున్నాయి. అయితే అందరికంటే ముందుగా నాగార్జున సతీమణి అమల తన మొదటి రివ్యూ ఇచ్చేశారు. బ్రిలియంట్ పెర్ఫెమెన్స్. బ్రిలియంట్ ఫిల్మ్!. నో నాన్సెన్స్ - కరెక్ట్ గా చెప్పిన కథ. సినిమాలో సౌండ్ సీటు నుంచి కదలనివ్వకుండా చేస్తుంది. మొత్తానికి సినిమా అన్ని విధాలా ఆకట్టుకుంది. అందుకు గాను మై స్వీట్ హార్ట్ నాగార్జునకు అండ్ ఆఫీసర్ సినిమా కోసం వర్క్ చేసిన చిత్ర యూనిట్ కి తన విషెస్ అని అమల పోస్ట్ చేశారు.
ఇక వర్మ అమల ట్వీట్ ను తన ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ అనందపడి పోయాడు. హే థ్యాంక్స్ అమల అంటూ ఓ కామెంట్ కూడా పెట్టాడు. ఇక ఆఫీసర్ సినిమా అసలు రిజల్ట్ ఏంటి అనేది మరికొన్ని గంటల్లో తెలిసిపోతుంది. ఇప్పటివరకు చిత్ర యూనిట్ నుంచి అలాగే అక్కినేని ఫ్యామిలీ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మరి సినిమా ప్రేక్షకుల టాక్ ఎలా ఉంటుందో చూడాలి.