నాగ్‌ అండ్ సన్స్‌.. ఎంజాయ్‌ చేస్తున్నారంతే

Update: 2016-03-12 18:33 GMT
వరుసగా అన్నీ హిట్లే. టివిలో మీలో ఎవరు కోటీశ్వరుడు సూపర్ హిట్‌. మనం సినిమా హిట్‌. తరువాత సోగ్గాడే చిన్ని నాయనా హిట్‌. ఇప్పుడేమో ఊపరి ట్రైలర్‌ కు ఎక్కడ చూసినా కూడా పాజిటివ్‌ టాక్‌. ఈ రేంజులో క్లిక్కయ్యాక మరి నాగ్‌ సెటబ్రేట్‌ చేసుకోవాలిగా...

అందుకే.. తన ఊపిరి సినిమా రిలీజవ్వడానికి ఇంకా రెండు వారాలు టైముంది కాబట్టి.. ఈ గ్యాపులో ఒక చిన్న హాలిడే ట్రిప్‌ కు వెళ్ళిరావాలని డిసైడయ్యాడు. అవ్వడమే కాదు.. ఆల్రెడీ తన ఇద్దరు కొడుకులు నాగ చైతన్య అండ్‌ అఖిల్‌ ను తీసుకొని మాల్డీవ్స్‌ వెళ్లిపోయాడు. అక్కడ వేరే ట్రైనర్‌ తో కలసి స్కూబా డైవింగ్‌ కూడా చేస్తున్నారు. చక్కగా సముద్రం కిందకు వెళ్లి.. కత్తిలా ఎంజాయ్‌ చేస్తున్నారట. ఈ విషయం స్వయంగా నాగ్‌ పంచుకున్నాడట.

బాగానే ఉందిలే. అయితే చక్కగా అటు చైతూకు కూడా ఒక రెండు హిట్లు కొట్టడానికి నాగ్‌ సాయపడి.. ఆ తరువాత అఖిల్‌ ను కూడా రెండో సినిమాతో ఒక హిట్టు హీరోని చేస్తే.. వారు కూడా నాగ్‌ తో బాటు ఇంకా ఎంజాయ్‌ చేస్తారు.
Tags:    

Similar News