అక్షర ఎనిమిది రకాలుగా ఆడగలదట

Update: 2016-03-03 15:30 GMT
కమల్ హాసన్ రెండవ కూతురు అక్షర హాసన్ తెలుసుకదా. ఈ నీలి కళ్ళ చిన్నది షమితాబ్ సినిమాలో ధనుష్, అమితాబ్ లతో కలిసి సందడి చేసిన విషయం కూడా తెలుసుకదా. నటనేకాక అక్షరకి మరెన్నో విద్యలు తెలుసట. అందులో ముఖ్యమైనది నాట్యం.

ఎనిమిదవ ఏట నుండే నాట్యంపై శిక్షణ తీసుకుంటూ ఇప్పుడు ఏకంగా ఎనిమిది రకాల నృత్య రీతులలో ప్రావీణ్యం సంపాదించడం విశేషం. అందులో ఐదు వెస్ట్రన్ శైలి కావడం మరో విశేషం. కూచిపూడి, భరతనాట్యం లో సైతం పేరొందిన గురువుల దగ్గర శిక్షణ తీసుకున్నట్టు సమాచారం.

ఇన్ని పట్టున్నా ఇప్పటికీ అక్షర స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేదట. ఆ రోజు కోసం ఎదురుచూస్తున్నట్టు సమాచారం. అంతేకాక నృత్య శిక్షణకి అడ్డుపడుతుందనే కారణంతో మణిరత్నం ఒకే బంగారం సినిమాలో ఆఫర్ ని కూడా వదులుకుందట. 
Tags:    

Similar News