రజినీ కోసం పెద్ద త్యాగమే చేశాడు

Update: 2015-12-24 17:30 GMT
ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గర్ లాంటి హాలీవుడ్ సూపర్ స్టార్ వేయాల్సిన పాత్రను తను వేయబోతున్నాడు అక్షయ్ కుమార్. అందుకే రోబో-2 ఓ సౌత్ మూవీ అయినా చాలా ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాడు. అక్షయ్ కి గతంలోనే సౌత్ ఇండియా నుంచి చాలా ఆఫర్లు వచ్చాయి. కానీ అవేవీ ఒప్పుకోలేదు. కానీ ఇండియాస్ హైయెస్ట్ బడ్జెట్ మూవీ.. పైగా శంకర్ దర్శకత్వం.. పైగా రజినీకాంత్ హీరో అనే సరికి.. తాను హిందీలో చేయాలనుకున్న ప్రెస్టీజియస్ మూవీని పక్కనబెట్టి మరీ రోబో-2 చేస్తున్నాడట ఈ స్టార్ హీరో. అక్షయ్ హీరో మాత్రమే కాదు.. నిర్మాత కూడా. ఓ మై గాడ్ - జోకర్ లాంటి సినిమాల్ని తనే స్వయంగా నిర్మించాడు. ఈ వరుసలోనే ‘నమస్తే ఇంగ్లాండ్’ అనే సినిమా చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నాడు అక్షయ్.

‘నమస్తే లండన్’కు స్క్రిప్టు వర్కంతా కూడా పూర్తయి ఇంకో నెల రోజుల్లో సెట్స్ మీదికి వెళ్లడమే ఆలస్యం అనుకుంటుండగా అనుకోకుండా రోబో-2 అవకాశం అక్షయ్ ముందు వాలిందట. ఐతే ఈ ప్రాజెక్టుకు ఉన్న క్రేజ్ ఏంటో బాగానే అర్థం చేసుకున్న అక్షయ్ తన సొంత సినిమాను పక్కనబెట్టి మరీ రోబో-2కు సంతకం పెట్టేశాడు. మామూలుగా బాలీవుడ్లో పెద్ద పెద్ద సినిమాల్ని సైతం మూణ్నాలుగు నెలల్లో పూర్తి చేసేస్తుంటాడు అక్షయ్. కానీ రోబో-2కు మాత్రం దాదాపు ఆరు నెలల బల్క్ డేట్స్ కూడా ఇచ్చాడట. ఎప్పుడు అవసరమైతే అప్పుడు షూటింగ్ కు రావడానికి కూడా అంగీకరించాడట. మన సౌత్ ఇండియన్ సినిమా మీద బాలీవుడ్ తారలకు ఎంత గౌరవం పెరిగిందో చెప్పడానికి ఇదో ఉదాహరణ.
Tags:    

Similar News