కరోనా మొదటి వేవ్ సమయం లో బిగ్ బి అమితాబ్ బచ్చన్ - చిరంజీవి సహా అన్ని ఇండస్ట్రీల పెద్ద స్టార్లు ఒక ప్రత్యేక వీడియో సందేశం ద్వారా జాతిని జాగృతం చేసేందుకు కృషి చేసిన సంగతి తెలిసిందే. కరోనా పై పెద్ద ఎత్తున అవగాహన పెంచడంలో అప్పటి ప్రయత్నం సఫలమైంది. అన్ని పరిశ్రమల పెద్ద స్టార్లు ముందుకు వచ్చి బాధ్యతగా ప్రజలకు అన్ని విషయాల్ని విడమర్చి చెప్పడం ద్వారా అప్రమత్తం చేశారు.
అలాంటి ప్రత్యేక అవగాహన వీడియో కార్యక్రమాల్ని పదే పదే సిద్ధం చేసి ప్రభుత్వాలకు స్టార్లు సహకారం అందించడం ప్రతిసారీ ప్రశంసించదగినది. ఈ కరోనా కష్ట కాలంలో స్టార్లు తమవంతు విరాళాల సాయం చేస్తూ మంచికి తాము సైతం అంటూ సేవ చేస్తున్నారు. సెకండ్ వేవ్ ప్రభావంపై ప్రజల్ని అప్రమత్తం చేస్తున్నారు.
తాజాగా ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఫిక్కీ) ప్రచార కార్యక్రమానికి సహకరించేందుకు అక్షయ్ కుమార్- మెగాస్టార్ చిరంజీవితో కలిసి ఆర్య- పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్లు జత కలిసారు. పంజాబీ - హిందీ-తెలుగు సహా పలు భాషల్లో ఈ వీడియో రిలీజ్ కానుంది.
వైరస్ ప్రభావాన్ని తగ్గించడానికి సమర్థవంతమైన నివారణ కార్యక్రమాన్ని అమలు చేయడానికి ఇది చాలా అవసరం. టీకా ప్రాముఖ్యత సహా మూడో వేవ్ ముప్పు గురించి ముందే అప్రమత్తం చేయడం వంటివి ఈ కార్యక్రమంలో ఉంటాయి. దేశాన్ని జాతిని జాగృతం చేయడమే దీని ఉద్ధేశమని ఫిక్కీ ప్రకటించింది.