పాపం జాన్వి.. ఎంత కష్టం వచ్చిందో..?
కొరటాల శివ కూడా జాన్వి గ్లామర్ ని బాగానే వాడుకోవాలని ఫిక్స్ అయ్యి తారక్ తో రెండు డ్యూయెట్స్ ప్లాన్ చేశాడు.
బాలీవుడ్ తో పాటు ఇప్పుడు తన ఫోకస్ ని సౌత్ ఇండస్ట్రీ మీద కూడా పెట్టింది జాన్వి కపూర్. సినిమాలో జాన్వి ఉంది అంటే గ్లామర్ పరంగా అదరిపోతుంది అంతే అన్నట్టుగా ఉంది. ముఖ్యంగా జాన్వి కపూర్ రీసెంట్ గా ఎన్టీఆర్ తో కలిసి దేవర సినిమాలో నటించింది. ఆ సినిమాలో తంగం పాత్రలో నటించింది. వర మనసు గెలుచుకోవాలని తంగం చేసే గ్లామర్ షోకి అతనేమో కానీ ఆడియన్స్ మాత్రం ఫిదా అయ్యారు. కొరటాల శివ కూడా జాన్వి గ్లామర్ ని బాగానే వాడుకోవాలని ఫిక్స్ అయ్యి తారక్ తో రెండు డ్యూయెట్స్ ప్లాన్ చేశాడు.
దేవరతో జాన్వి టాలీవుడ్ ఎంట్రీ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఇక ఇప్పుడు అమ్మడు తన నెక్స్ట్ సినిమాల మీద ఫోకస్ పెడుతుంది. దేవర 2 తో పాటు ఆర్సీ 16 సినిమాలో ఛాన్స్ పట్టేసింది అమ్మడు. బుచ్చి బాబు డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో చరణ్ కి జతగా జాన్వి మరోసారి ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. జాన్వి కపూర్ గ్లామర్ సీక్రెట్ ఏంటన్నది తెలియదు కానీ అమ్మడు అలా కనిపించడానికి చాలా ఇష్టమైన వాటిని దూరం చేస్తుందని తెలుస్తుంది.
ముఖ్యంగా లుక్ విషయంలో హీరోయిన్స్ చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. అందుకే వాళ్లు ఎప్పుడు పడితే అప్పుడు ఏది పడితే అది తినరు. ఫుల్ డైట్ ఫాలో అయితేనే వాళ్లు డిఫరెంట్ గా కనిపిస్తారు. ఐతే జాన్వి లేటెస్ట్ గా తన సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ ఆమె బాధ ఏంటన్నది అర్థమవుతుంది. ఇంతకీ అమ్మడు ఏం షేర్ చేసింది అంటే.. జాన్వి కపూర్ ఒక కప్ లో ఐఎస్ క్రీం తో కూడిన కుకీస్ ను చూపిస్తూ ఎవరైనా నన్ను ఆపేయమని చెప్పండి అంటూ కామెంట్ పెట్టింది.
అంటే మనసుకి తినాలని ఒకవైపు అనిపిస్తున్నా మళ్లీ దీని వల్ల ఏదైనా శరరీ మార్పులు వస్తే కష్టమని తనకు తానుగా వద్దని చెప్పుకోలేక ఎవరైనా సరే వద్దని చెప్పండి అంటూ రాసుకొచ్చింది. కోట్లు కొద్దీ సంపాదించే వారు ఎలా పడితే అలా తింటారు.. ఏది కావాలంటే అది చేస్తారని అనుకుంటారు. కానీ నిజానికి వాళ్లు ఎన్నో రకాల డైట్ ప్లాన్ ఫాలో అయితేనే తెర మీద అంత అందంగా కనిపిస్తారు. అది కేవలం డబ్బు ఉన్న వాళ్లకే అని కాదు.
సరైన క్రమపద్ధతిలో డైట్ ఫాలో అవ్వడం వల్లే అలా కనిపిస్తారు. ఐతే కొందరు తమ కోరికలను నిగ్రహించుకోలేక ఏది పడితే అది తినేసి శరీరంలో మార్పులకు కారణమవుతారు. మరి జాన్వి ఐస్ క్రీం ఎందుకు తినకూడదు అనుకుందో కానీ ఎవరైనా ఆపమంటే మాత్రం ఆపేస్తా అన్నట్టుగా చెప్పుకొచ్చింది.