గతంలో ఫోటో అంతే అదో పెద్ద తతంగం. ఫోటో లు తీసేందుకు ప్రత్యేకం గా ఫోటోగ్రాఫర్లు ఉండేవారు. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఫోటోగ్రాఫరే.. వీడియో గ్రాఫరే. తమ కు తాము ఫోటోలు తీసుకునేందుకు 'సెల్ఫీ' అనే పేరుపెట్టి అదేపని గా ఫోటోలు తీసుకుంటున్నారు. ఫేస్ బుక్ లో అప్లోడ్ చేసి జనాల తాట తీస్తున్నారు. సెలబ్రిటీలయితే ట్విట్టర్.. ఇన్స్టాగ్రామ్ లలో తమ ఫోటోలను అదేపని గా పోస్ట్ చేస్తుంటారు. ఇన్స్టాగ్రామ్ విషయం తీసుకుంటే అందులో ముఖ్యమైన ఫీడ్ ఫోటోలు.. వీడియోలే. అవిలేకపోతే ఇన్స్టాగ్రామే లేదు.
తాజాగా బాలీవుడ్ సుందరి పరిణీతి చోప్రా తన సోషల్ మీడియా ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ చేసింది. ఫోటో తీసింది విమానంలో. ఆమె విండో సీటు లో కూర్చుని బయటకు చూస్తోంది. ఆ ఫోటోలో డార్క్ కలర్ స్వెట్ షర్టు వేసుకుని గాగుల్స్ పెట్టుకొని ఉంది. ఫోటోలో పెద్దగా చెప్పుకోవలసింది ఏమీ లేదు. గ్లామరసం కూడా చిందించలేదు. మరేమీ ప్రత్యేకత లేకపోతే ఆమె ఎందుకు ఆ ఫోటో ను పోస్ట్ చేసినట్టు? ఎందుకంటే ఆ ఫోటో ను క్లిక్ మనిపించిన వ్యక్తి బాలీవుడ్ స్టార్ అక్షయ్ కుమార్.
ఆ కారణం చాలు కదా ఆ ఫోటో స్పెషల్ గా మారేందుకు. పరిణీతి ఆ విషయాన్నే ఒక క్యాప్షన్ ద్వారా తెలిపింది. "ఫోటో క్రెడిట్: అక్షయ్ కుమార్" అని రివీల్ చేసింది. శంకర్ సినిమా లో అందరి ఫోన్లు లాగేసుకొని భీభత్సం సృష్టించిన పక్షిరాజు ఇప్పుడు అదే ఫోన్ తో ప్లేన్ లో పరిణీతి కి కూల్ గా ఫోటోలు తీస్తున్నాడు. అంటే ఫోన్లు వాడడం ఎవ్వరూ మానరన్నమాట. ఆఖరుకి పక్షిరాజు కూడా.