ఆ హీరో ట్యూబ్ లైట్ అంతే అంటున్నారు..!

Update: 2022-12-08 07:33 GMT
బాలీవుడ్ హీరోల్లో బాగా బ్యాడ్ లక్ నడుస్తుంది అంటే అది అక్షయ్ కుమార్ కే అని చెప్పొచ్చు. ఆఫ్టర్ పాండమిక్ సూర్యవంశీ తో ఒక హోప్ వచ్చేలా చేసిన అక్షయ్ కుమార్ 2022 డిజాస్టర్ ఇయర్ అయ్యింది. ఆయన చేసిన అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఒకటి రెండు కాదు ఏకంగా ఐదు సినిమాలు ఈ ఇయర్ రిలీజ్ చేయగా అవన్ని ప్రేక్షకులను మెప్పించలేక పోయాయి. అయితే ఫలితాలతో సంబంధం లేకుండా అక్షయ్ తన సినిమాలు చేస్తూ వెళ్తున్నాడు. ప్రస్తుతం అక్షయ్ కుమార్ ఛత్రపతి శివాజి కథతో మూవీ చేస్తున్నారు.    

బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. సినిమా నుంచి లేటెస్ట్ గా గ్లింప్స్ రిలీజ్ చేశారు. శివాజి లుక్ లో అక్షయ్ కుమార్ బాగానే ఉన్నా టీజర్ లో తప్పులను వేలెత్తి చూపుతూ నెటిజన్లు సినిమాని ట్రోల్ చేస్తున్నారు.

అలా రాజదర్బార్ లో నడుచుకుంటూ అక్షయ్ కుమార్ వస్తుంటాడు. అయితే అక్కడ ఫ్రెం లో ఒక ట్యూబ్ లైట్ జూమర్ ఉంటుంది. అది చూసి సోషల్ మీడియాలో ట్రోల్స్ మొదలయ్యాయి. శివాజి 1674 టైం లో రూల్ చేశాడు. అయితే ఆ తర్వాత ఎప్పుడో 1880 లో కానీ థామస్ ఎడిసన్ బల్బ్ కనిపెట్టలేదు. అలాటిది ఆ టైం లో ట్యూబ్ లైట్స్ ఎక్కడ నుంచి వచ్చాయంటూ కామెంట్స్ చేస్తున్నారు.   

చరిత్రని సినిమాగా తీయాలంటే ఆ టైం లో పరిస్థితి ఎలా ఉంటుందో అలా తీయాలి ఈమధ్య ఆడియన్స్ కూడా చాలా క్లవర్ గా మారారు. సినిమా టీజర్ లో ఏ చిన్న తప్పు వచ్చినా చెప్పేస్తున్నారు.

అలాంటిది శివాజి కథ సినిమాగా తీస్తూ ఇలాంటి పొరపాట్లు చేస్తారా అని ఆడియన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఒక సినిమాకు ఫస్ట్ లుక్ తోనే బజ్ ఏర్పడుతుంది. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే అక్షయ్ కుమార్ శివాజి సినిమాకు మొదటి ఇంప్రెషనే ఆడియన్స్ నుంచి విమర్శలు అందుకుంది.

అయితే సినిమా మాత్రం వారు ఆశించిన స్థాయిలోనే ఉంటుందని అంటున్నారు చిత్ర యూనిట్. అక్షయ్ కుమార్ ఈ మూవీతో అయినా హిట్ ట్రాక్ ఎక్కుతాడేమో చూడాలి. ఈ సినిమాని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారు. ఎలాగు బాలీవుడ్ సినిమాలు కొన్ని డైరెక్ట్ సౌత్ రిలీజ్ లు అవుతున్నాయి కాబట్టి ఇక్కడ మార్కెట్ పై కూడా కొన్ని ప్రాజెక్ట్ లు దృష్టి పెడుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News