బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ పై గత కొన్ని రోజులుగా సోషల్ మీడియా జనాలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెల్సిందే. ఇండియన్ పౌరసత్వం లేకపోవడం వల్ల ఓటు వేయలేక పోయిన అక్షయ్ కుమార్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ ను ఎదుర్కొంటున్నాడు. ఇటీవలే ఆ విమర్శలకు గట్టి కౌంటర్ ఇచ్చిన అక్షయ్ కుమార్ తాజాగా ఒడిస్సా రాష్టంలో ఫణి తుఫాన్ వల్ల నష్టపోయిన వారికి సహాయార్ధం కోటి రూపాయల విరాళంను ప్రకటించాడు.
అక్షయ్ కుమార్ ఇప్పుడు మాత్రమే కాకుండా గతంలో కూడా పలు సార్లు తన దాతృత్వంను చాటుకున్నాడు. భారత్ కే వీర్ ఫౌండేషన్ కు ఆర్మీ వారి సహాయార్థం అయిదు కోట్ల రూపాయల ఆర్ధిక సాయంను చేయడం జరిగింది. ఇక అంతకు ముందు కూడా కేరళ మరియు తమిళనాడులో తుఫాన్ వచ్చిన సమయంలో అక్షయ్ కుమార్ తనవంతుగా కోటి సాయంను అందించాడు. ఇప్పుడు ఒడిస్సాలో కూడా తన సాయంను చేయడం జరిగింది.
తనపై వస్తున్న విమర్శలకు ఇలా అక్షయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఏవో కారణాల వల్ల భారత పౌరసత్వం తీసుకోకుండా ఉన్న అక్షయ్ కుమార్ సామాజిక బాధ్యతతో తన దేశం అనుకుని సాయం చేస్తూనే ఉన్నాడు. పౌరసత్వం అనేది ఆయన వ్యక్తిగతం, ఆ విషయంలో ఆయన్ను విమర్శించడం సరైనది కాదని అక్షయ్ కి మద్దతుగా నిలిచే వారు కూడా ఉన్నారు. వరుసగా వందల కోట్ల సినిమాలు చేస్తున్న అక్షయ్ కుమార్ భారీ విరాళాలు ఇస్తూ తన మంచితనం చాటుకుంటూ ఇతర హీరోలకు ఆదర్శంగా నిలుస్తున్నాడు.