సాహ‌సాల వీరుడి బ‌యోపిక్ లో ఖిలాడీ స్టార్!

Update: 2022-11-18 09:30 GMT
బాలీవుడ్ స్టార్ ఖిలీడీ అక్ష‌య్ కుమార్ స్టోరీ ఎంపిక‌ల గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. క‌మ‌ర్శియ‌ల్ చిత్రాల‌తో పాటు వినూత్న ప్ర‌యోగాల‌కు త‌గ్గ‌ని స్టార్. ఎలాంటి జాన‌ర్ చిత్రాలైనా అక్ష‌య్ స‌రితూగుతాడ‌ని ఎన్నోసార్లు  నిరూపించారు. ఎలాంటి పాత్ర‌లోనైనా ప‌ర‌కాయ ప్రవేశం చేయ‌గ‌ల న‌టుడిగా అక్ష‌య్ కి మంచి పేరుంది. తెర‌పై న‌టుడిగా మాత్ర‌మే క‌నిపించాల‌ని...హీరో..విల‌న్ అనే భావన లేకుండా ముందుకు వెళ్ల‌డం అక్ష‌య్ కి మాత్ర‌మే తెలిసిన విద్య‌.

న‌ట‌న ప‌రంగా అంత‌టి ప‌రణ‌తి చెందిన న‌టుడు కాబ‌ట్టే త‌న‌కు పాత్ర న‌చ్చితే ఎస్ అనే మాట త‌ప్ప‌..నో అన‌డానికి ఛాన్స్ ఉండ‌ద‌ని ఎన్నోసార్లు రుజువు చేసారు. ఇటీవ‌లే  బ‌యోపిక్ అనే న్యూజాన‌ర్ లోకి కూడా అక్ష‌య్ అడుగు పెట్టిన సంగ‌తి తెలిసిందే.  వెండి తెర‌పై రాజ‌సం ఉట్టి ప‌డే పాత్ర‌ల కోసం అక్ష‌య్ సైతం ఎంతో ఆస‌క్తి గా ఉన్నాడ‌ని తెలుస్తోంది.

ఇటీవ‌లే హిస్టారికల్ డ్రామా-సామ్రాట్ పృథ్వీరాజ్ గా ప్రేక్ష‌కుల్ని మెప్పించాల‌ని ప్ర‌య‌త్నించిన విఫ‌ల‌య‌త్న‌మైంది. భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన సినిమా బెడిసికొట్టింది. దీంతో మ‌రాఠా యోధుడి క‌థ‌నే టార్గెట్ చేసి బ‌రిలోకి దిగుతున్నారు. ఛ‌త్ర‌పతి శివాజీ  క‌థ‌లో న‌టించ‌డానికి రెడీ అవుతున్నారు. అక్షయ్ కిది  తొలి మరాఠీ అరంగేట్ర చిత్రం కానుంది.

ఈ సినిమా ఇతర భాషల్లో కూడా విడుదలవుతుంది. ఇది తనపై ఉంచిన బృహత్తర బాధ్యత అని.. ఇది తనకు డ్రీమ్ రోల్ అని అక్షయ్ అన్నారు. ఈ నేప‌థ్యంలో  తాజాగా అక్ష‌య్ మ‌రో బ‌యోపిక్ కి గ్రీన్ సిగ్నెల్ ఇచ్చారు.  ఓ గొప్ప సాహ‌స వీరుడు నిజ జీవితంలో ప్ర‌వేశించ‌డానికి రెడీ అవుతున్నారు. ప‌శ్చిమ బెంగాల్ లో జ‌రిగిన ఓ  బొగ్గు గ‌ని ప్ర‌మాదంలో 64 మంది కాపాడి గొప్ప మ‌నిషిగా నిలిచిన జ‌శ్వంత్ సింగ్ గ్రిల్ జీవిత క‌థ‌లో అక్ష‌య్ న‌టించ‌బోతున్నారు.

ఈ విష‌యాన్ని స్వ‌యంగా అక్ష‌య్ కుమార్ ప్ర‌క‌టించారు. 'రుస్తం' ద‌ర్శ‌కుడు టిన్ సురేశ్ దేశాయ్ ఈ చిత్రాన్ని తెర‌కెక్కించ నున్నారు.  ఇలాంటి  అడ్వెంచ‌ర్స్ జ‌శ్వంత్ ఎన్నోచేసారు. అందుకుగాను ఎన్నో పుర‌స్కారాలు అందుకున్నారు.

కానీ దుర దృష్ట‌వ‌శాత్తు 2019లో ఆయ‌న క‌న్నుమూసారు.  ఇప్పుడాయ‌న జీవిత క‌థ‌కి అక్ష‌య్ కుమార్  వెండి తెర రూపం ఇవ్వ‌బో తున్నారు. పూజా ఎంట‌ర్ టైన్ మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News