కెరీర్ లో ఇప్పటిదాకా చేసిన సినిమాలన్నీ ఒక ఎత్తు.. ‘ఎయిర్ లిఫ్ట్’ ఒకెత్తు అని గర్వంగా చెప్పుకుంటున్నాడు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్. ఈ సినిమా చేసినందుకు తానెంత గర్విస్తున్నానో.. దీన్ని చూసి ప్రతి భారతీయ ప్రేక్షకుడు కూడా అలాగే గర్విస్తాడని చెబుతున్నాడతను. అక్షయ్ అంత గొప్పగా ఈ సినిమా గురించి చెప్పడానికి కారణాలు లేకపోలేదు.1990లో కువైట్ పై ఇరాక్ నియంత సద్దాం హుస్సేన్ దండయాత్ర జరిపినప్పుడు.. భారత్ విరోచితంగా వ్యవహరించి.. అక్కడ చిక్కుకుపోయిన 1.70 లక్షల మంది భారతీయుల్ని మన దేశానికి తరలించింది. ప్రపంచంలోనే అతి పెద్ద శరణార్థుల వైమానిక తరలింపు ఇదేనని గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ కూడా గుర్తించింది. అప్పటి దృశ్యాల్ని కళ్లకు కట్టేలా ‘ఎయిర్ లిఫ్ట్’ సినిమాను రూపొందించారు.
ఈ చిత్రం జనవరి 23న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సందర్భంగా అక్షయ్ మాట్లాడుతూ.. నాటి భారత వైమానిక దళాల సాహస కృత్యాన్ని పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కించాలని.. ‘ఎయిర్ లిఫ్ట్’సినిమాను ప్రతి భారతీయుడూ చూడాలని అన్నాడు. 'గిన్నిస్ బుక్ ను తెచ్చుకొని అందులో అతిపెద్ద వైమానిక తరలింపు ఏదని చూస్తే భారతే కనిపిస్తుంది. దీన్ని అందరి దృష్టికి తీసుకురావాలనే దృష్టితోనే ఈ కథతో సినిమా చేస్తన్నాం. ఇది మన పాఠ్యపుస్తకాల్లో చేర్చాల్సిన కీలకమైన అధ్యాయం. ఈ విషయమై నేను ఇప్పటికే ప్రభుత్వానికి విజ్నప్తి చేశాను.1.70లక్షలమంది శరణార్థులను 488విమానాల్లో 59 రోజులపాటు ఎలా సురక్షితంగా తరలించారనే విషయాన్ని చూపిస్తున్నాం. ఇది ప్రతి ఒక్క భారతీయుడు గర్వించే ప్రత్యేకమైన సినిమా’’ అని అక్షయ్ చెప్పాడు.