ఒక సినిమా విజయం సాధించడమే గగనమైపోతున్న ఈ రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ వసూళ్లు చేయడం చాలా గొప్ప విషయం. ఇక రోజుల తరబడి ఆ సినిమాలు థియేటర్లను అంటిపెట్టుకోవడం ఇంకా ఆశ్చర్యం.. కాదు కాదు ఎలాంటివారినైనా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే అంశం. సంక్రాంతికి విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు'.. 'అల వైకుంఠపురములో' రెండూ సిసలైన పండగ కోడిపుంజుల్లా బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడ్డాయి. పండగ కళను తీసుకొచ్చాయి.
ఈ రెండు సినిమాల థియేట్రికల్ రన్ పూర్తయిందని అనుకుంటున్నారు కానీ ఇంకా అక్కడక్కడా థియేటర్లలో ఈ రెండు సినిమాలు ఉన్నాయి. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ లోకి వచ్చిన తర్వాత ఎవరు థియేటర్ లో చూస్తారని అనుకోవచ్చు కానీ 100 రోజుల రికార్డు కోసమని ఇలా కొన్ని చోట్ల సినిమాలను రన్ చేస్తున్నారట. ఎలాగూ సినిమా థియేటర్ లో ఉన్నప్పుడు చూసేవారు కొందరైనా ఉంటారు కదా. అయితే మాయదారి కరోనా వైరస్ పుణ్యమా అని థియేటర్లు మూతపడ్డాయి. దీంతో ఈ 100 రోజుల రికార్డులు హుష్ కాకీ. ఈ రెండు సినిమాలే కాదు. 'భీష్మ' 50 రోజుల రికార్డు కూడా కరోనా దెబ్బకు మిస్ అవుతోంది. ఎందుకంటే సినిమా హాల్స్ రీ ఓపెన్ చేసే సమయానికి కొత్త సినిమాలు వస్తే 'భీష్మ' కు అవకాశం ఉండదు.
అయినా సరే 100 రోజుల రికార్డులు వేసుకుంటామని పట్టుబడితే అవి కాస్తా 'నాన్ - బాహుబలి రికార్డు' ల తరహాలో 'విత్ కరోనా 100 రోజుల రికార్డు' అని చెప్పుకోవాల్సిందే. మొత్తానికి ఈ వందరోజుల రికార్డులకు పూర్తిగా మంగళం పాడడానికే చైనా వారు మనకు కరోనాను ఎగుమతి చేసి ఉంటారంటారా?