పాండే పాప.. ఏం రచ్చ చేస్తోందిలే

Update: 2018-02-12 18:30 GMT
స్టార్ కిడ్స్ హంగామా కొత్తేమీ కాదు. శ్రీదేవి డాటర్ నుంచి అమితాబ్ బచ్చన్ మనవరాలి వరకూ బోలెడు మంది తారల వారసులు.. సోషల్ మీడియాలో రచ్చ చేసేస్తోంటారు. ఇందులో ఎవరి హంగామా వారిది. అలాంటి వారిలో చుంకీ పాండే మేనకోడలు అలనా పాండే కూడా ఉంది.

సోషల్ మీడియాలో అలనాకి విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. ఇందుకు కారణం.. అమ్మడి సొగసుల ధారబోతే. ఈ జనరేషన్ టీనేజర్ కావడంతో.. అస్సలు మొహమాటాలు పెట్టుకోకుండా యథేచ్చగా ఫోటోలకు పోజులు ఇచ్చేస్తూ ఉంటుంది. వంటిమీద చిన్నపాటి దుస్తులు మాత్రమే ఉన్నాయనే ఫీలింగ్ అమ్మడి కళ్లలో కానీ.. బిహేవియర్ లో కానీ అణువంత కూడా కనిపించదంటే.. ఈమెకు అల్ట్రా మోడర్న్ వేర్ ఎంతగా నప్పుతాయో అర్ధం చేసుకోవచ్చు. అలనా షేర్ చేసే ఫోటోలు.. ఆమెకు సంబంధించి బయటకు వచ్చే పిక్స్ మరిన్ని ఉంటాయి. రీసెంట్ గా టూ పీస్ బికినీ మాదిరి డ్రెస్ లో ఈ పిల్ల చేసిన హంగామా అంతా ఇంతా కాదు.

అసలు తనను ఫోటోలు తీస్తున్న విషయం కూడా పట్టించుకోకుండానే తన పని తాను చేసుకుపోయింది అలనా పాండే. ఆమె కంటే ఎక్కువగా అలనా ఫోటోలే ఎక్కువగా సోషల్ మీడియాలో హల్ చల్ చేసేస్తున్నాయంటే.. పాండే పాప ఏ రేంజ్ లో ఫాలోయర్స్ ను పిచ్చెక్కించేస్తోందనే సంగతి అర్ధమవుతుంది. ఇలాంటి బ్యూటీకి గానీ మోడర్న్ గాళ్ అవకాశాలు వస్తే.. ఇక ఆన్ స్క్రీన్ రచ్చ రచ్చే.
Tags:    

Similar News