రణబీర్ కపూర్ - అలియాభట్ ఏప్రిల్ లో వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ఇటీవలే గర్భం దాల్చిన విషయాన్ని కూడా అలియా రివీల్ చేసింది. అయితే అలియా పెళ్లైన రెండు నెలలుకే గర్భం దాల్చడంపై కొంత మంది శుభాకాంక్షలు చెప్పగా..మరికొంత మంది నెగిటివ్ కామెంట్లు పోస్ట్ చేసారు.
వివాహమైన రెండు నెలలుకే గర్భం ఏంటని? అప్పుడే పిల్లల్ని కనాల్సిన వయసు వచ్చేసిందా? అంటూ కొన్ని నెగిటివ్ కామెంట్లు వైరల్ అయ్యాయి. అయితే వీటిపై ఇన్నాళ్లు మౌనం వహించిన అలియాభట్ ఒక్కసారిగా నిప్పులు చెరిగింది. విమర్శించిన నోళ్లు మూతలు పడేలా వాతలు వేసింది.
``సాధారణంగతా ఒక అమ్మాయి ఏం చేసినా అందరికీ ఏదోదే పెద్ద వార్తలా అనిపిస్తుంది. అమ్మాయి ఎవరినైనా ప్రేమించినా.. డేటింగ్ లో ఉందని తెలిసినా.. తల్లి కాబోతుందని తెలిసినా.. ఇలా సందర్భం ఏదైనా సరే కొందరు చర్చకు తెర తీస్తారు. వాటిని ఆసరాగా చేసుకుని మరికొంత మంది విమర్శలు చేస్తారు. అంతెదుకు? క్రికెట్ చూడటానికి వివేశాలు వెళ్లినా.. ఏదైనా హాలిడే ట్రిప్ కి వెళ్ళినా సరే ప్రతి విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తారు.
మరి అందులో వాళ్లకి ఏం కనిపిస్తుందో తెలియదు గానీ.. మానసిక ఆనందం కోసమే అలాంటి పనులు చేస్తుంటారు. నేను గర్భం దాల్చిన దగ్గర నుంచి సోషల్ మీడియాలో ఎలాంటి వార్తొచ్చాయో నాకు తెలుసు. వాటిని ఏమాత్రం పట్టించుకోలేదు. మహిళల జీవితాల్లో కొన్ని గొప్ప విషయాలుంటాయి. వాటిని ఏ మహిళ ప్లాన్ చేసుకోదు. అలా జరిగిపోతుంటాయి.
నాది యుక్త వయసుని కొందరు భావిస్తుంటారు. అది నిజమే అనుకుందాం. దాని వల్ల మీకొచ్చిన నష్టం ఏంటి? యుక్త వయసులో పిల్లల్ని కంటే మీకేంటి నొప్పి? ఒక ఫ్యామిలీ.. లేదా పిల్లలను కలిగి ఉండటం నా ప్రొఫెషనల్ లైఫ్ మీద ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? అవి రెండూ పూర్తిగా భిన్నమైన విషయాలు. వ్యక్తిగత విషయాలపై చర్చలొద్దు అంటూ గట్టిగానే క్లాస్ పీకింది.
అలియా చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. మునుపన్నడు చూడని కొత్త అలియాని సోషల్ మీడియాకి పరిచయం చేసింది. అలియాభట్ నటించిన `డార్లింగ్స్` రిలీజ్ కి రెడీ అవుతోంది. తాజాగా ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. ఆ ఈవెంట్ లోనే ఈ వ్యాఖ్యలు చేసింది.