ఆ విషయం చెప్పానంటే అందరూ చస్తారంతే: రవితేజ

Update: 2022-07-28 14:30 GMT
రవితేజ హీరోగా 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా రూపొందింది. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకి, సామ్ సీఎస్ సంగీతాన్ని సమకూర్చాడు. ఈ నెల 29వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా  ప్రమోషన్స్  ఊపందుకున్నాయి.

తాజాగా ఈ సినిమా టీమ్ ను అలీ ఇంటర్వ్యూ చేశాడు. హీరో రవితేజ .. హీరోయిన్లు దివ్యాన్ష ..  రజీషా విజయన్ .. దర్శకుడు శరత్ మండవ ఈ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. సరదాగా .. సందడిగా ఈ సినిమా కొనసాగింది.

రవితేజ మాట్లాడుతూ .. " శరత్ మండవ కథ చెప్పిన తీరు ..  పాత్రలపై ఆయనకి గల క్లారిటీ .. తనపై తనకి గల నమ్మకం నాకు బాగా  నచ్చాయి. అందువలన మనం ఈ సినిమా చేస్తున్నాం అని చెప్పేశాను. ఈ సినిమాకి 'రామారావు ఆన్ డ్యూటీ' అనే టైటిల్  చెప్పినప్పుడు కూడా రెండో ఆలోచన పెట్టుకోకుండా ఫిక్సయిపో అనేశాను. అంతబాగా నాకు టైటిల్ నచ్చేసింది. గతంలో నేను పోలీస్ ఆఫీసర్ పాత్రలు చాలానే చేశాను .. కానీ సబ్ కలెక్టర్ గా చేయడం మాత్రం ఇదే మొదటిసారి. అందువలన నా పాత్ర నాకే చాలా కొత్తగా అనిపించింది.

ఇక హీరోయిన్స్ విషయానికి వస్తే రజీషా నాన్ స్టాప్ గా మాట్లాడుతూనే ఉంటుంది. ఆ రోజున ఏ సీన్ అయితే చేస్తుంటుందో  ఆమె అదే మూడ్ లో మాట్లాడుతూ ఉండటం నేను గమనించాను. సినిమాలో తన పాత్ర ఎలా బిహేవ్ చేస్తుంటుందో .. బయటకూడా అలాగే ప్రవర్తిస్తూ ఉంటుంది .. అలాగే మాట్లాడుతూ ఉంటుంది. ఆమె అలా చేయడం నిజంగా నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇక దివ్యాన్ష విషయానికి వస్తే ఆమె ఎక్కువగా మాట్లాడదు. పలకరిస్తే మాత్రం ఇక ఆగదు .. అలా మాట్లాడుతూనే ఉంటుంది.

ఆమె పైకి మాట్లాడకపోయినా .. టెన్షన్ పడుతున్నట్టు కనిపించకపోయినా ఆమె ఇన్నర్ వాయిస్ ఏమిటనేది నాకు వినిపిస్తూనే ఉంటుంది" అన్నాడు. అలీ అడ్డుతగులుతూ 'లేడీస్ అనుకునేది మాత్రమే తెలుస్తుందా? .. జెంట్స్ అనుకునేది కూడా తెలుస్తుందా? అని అడిగాడు.

"జెంట్స్ తో పనేలేదు .. లేడీస్ ఇన్నర్ వాయిసే వినిపిస్తుంటుంది" అని రవితేజ చెబుతున్నా వినిపించుకోకుండా, ప్రస్తుతం తన మనసులో తాను ఏమనుకుంటున్నది చెప్పమని అలీ అడిగాడు. "ఏయ్ .. ఆ విషయం చెప్పానంటే అందరూ చస్తారంతే" అంటూ రవితేజ పెద్దగా నవ్వేశాడు.
Tags:    

Similar News