దర్శకేంద్రుడి ఆపిల్‌ సీన్స్‌ స్టీవ్‌ జాబ్స్‌ చూశాడేమో

Update: 2019-03-20 06:16 GMT
కమెడియన్‌ అలీ తన సినిమాలతోనే కాకుండా స్టేజ్‌ కార్యక్రమాల్లో కూడా నవ్విస్తూ ఉంటాడు. అలీ ఎక్కడ ఉన్నా కూడా కామెడీ పండుతుంది. అయితే ఆయన డబుల్‌ మీనింగ్‌ డైలాగ్స్‌ తో నవ్విస్తాడనే విమర్శలు కూడా లేక పోలేదు. తాజాగా మరోసారి అలీ తన కామెడీ టైమింగ్‌ డైలాగ్స్‌ తో వార్తల్లో నిలిచాడు. తాజాగా ఈయన తిరుపతిలో జరిగిన మోహన్‌ బాబు 69వ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నాడు. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్‌ విద్యాసంస్థల్లో జరిగిన ఈ వేడుకల్లో సినీ మరియు రాజకీయ ప్రముఖులు మోహన్‌ బాబు సన్నిహితులు పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో పాల్గొన్న రాఘవేంద్ర రావు గురించి అలీ మాట్లాడుతూ.. ఆపిల్‌ సృష్టికర్తగా రాఘవేంద్ర రావు గారికి క్రెడిట్‌ ఇవ్వాలి. ఆయన తన సినిమాల్లో ఎక్కువగా ఆపిల్స్‌ ను వాడారు. ఎప్పుడైన స్టీవ్‌ జాబ్స్‌ మన రాఘవేంద్ర రావు గారి సినిమా చూశాడో ఏమో, ఆయన యాపిల్‌ ను కొరికి తన కంపెనీ లోగోగా పెట్టుకున్నాడు. ఆపిల్‌ ఫోన్‌ లు మరియు కంప్యూటర్లు కోట్లలో వ్యాపారం చేస్తున్నాయి అంటే అది రాఘవేంద్ర రావుగారి వల్లనే అంటూ చమత్కరించాడు.

సమాజంలో గన్ను కంటే కూడా చాలా పవర్‌ ఫుల్‌ అయ్యింది పెన్ను. ఎంతటి పెద్ద పని అయినా కూడా ఒక చిన్న సంతకంతో అవుతుంది. అలాంటి పెన్నును కొన్ని వేల మంది జేబుల్లో పెడుతున్న మోహన్‌ బాబు గారి శ్రీ విద్యానికేతన్‌ కు అభినందనలు అంటూ అలీ చెప్పుకొచ్చాడు. తాను సంపాదించిన డబ్బును విద్యారంగంలో పెడుతున్న మోహన్‌ బాబు గారు నిజంగా గ్రేట్‌ - ఆయన ఎప్పుడు సంతోషంగా - ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ అలీ తన ప్రసంగంను ముగించాడు.

Tags:    

Similar News