మా ఆయన్ని బాధ పెట్టకండి- ఆలీ వైఫ్

Update: 2015-11-08 05:38 GMT
టాలీవుడ్ ఆల్ టైం బెస్ట్ కమెడియన్స్ ని లిస్ట్అవుట్ చేస్తే.. టాప్ లీగ్ లో ఉండే పేర్లలో ఆలీ కూడా ఒకడు. ఈ విషయంలో ఎలాంటి సందేహాలు ఉండవు. ఆన్ స్క్రీన్ - ఆఫ్ స్క్రీన్ - ఫంక్షన్స్ - సెట్స్ - షూటింగ్.. ఇలా సందర్భం ఏదైనా సరే.. ఆలీ పూయించే నవ్వులు పువ్వులకు పొట్ట చెక్కలవ్వాల్సిందే. ఆలీ నా పక్కనుంటే హ్యాపీ అని పవర్ స్టార్ లాంటి సీరియస్ పర్సన్ కూడా చెప్పాడంటే.. ఈ కామెడీ కింగ్ ఎంతగా నవ్విస్తాడో అర్ధమవుతుంది.

అలాంటి ఆలీ ఈమధ్య వివాదాల్లో బాగానే ఇరుక్కుంటున్నాడు. నవ్వించడానికి తను చేసిన కొన్ని కామెంట్స్.. ఆలీపై విమర్శలు ఎక్కుపెట్టడానికి కారణమయ్యాయి. సోషల్ మీడియా ద్వారా తిట్టిపోస్తున్నారు కూడా. తన భర్తను ఇలా ఇతర మహిళలు తిట్టడంపై ఆలీ భార్య స్పందించారు. తన భర్త నవ్వించడానికే పుట్టిన వ్యక్తి అంటున్నారామె. 'మా వారికి నవ్వించడమే తెలుసు. నవ్వించాలనే ఆలోచనతోనే ఎక్కడికెళ్లినా వెళతారు. ఆయన నవ్వించడం కోసమే పుట్టారు. దయచేసి ఆయన్ని నవ్వులపాలు చేయకండి. ఆయన్ని వాడువీడు అని తిట్టింది ఒకామె. నవ్వించడానికి మాట్లాడిన మాటలతోనే మా ఆయన్ని అన్ని మాటలు అంటే.. ఇప్పుడు మా ఆయన్ని వాడు వీడు అన్నందుకు నేనేమనాలి. దయచేసి ఆయన్ని బాధ పెట్టకండి' అంటున్నారు ఆలీ భార్య.

కామెడీలో బెస్ట్ టైమింగ్  ఆలీది. అందుకే స్పాంటేనియస్ గా డైలాగ్స్ విసురుతుంటాడు. సెన్సాఫ్ హ్యూమర్ తో చేసే కామెంట్స్ కి అర్ధాలు వెతకద్దంటున్న.. ఆలీ భార్య మనోగతం కూడా అర్ధం చేసుకోదగ్గదే.
Full View



Tags:    

Similar News