గాలి కోటిన్నర ఇస్తానన్నా ఆమె రాలేదట!

Update: 2016-11-17 13:30 GMT
గత వారం రోజులుగా పెద్ద నోట్ల రద్దు వ్యవహారం తర్వాత మన దగ్గర అత్యంత చర్చనీయాంశం అవుతున్న అంశాల్లో గాలి జనార్దన రెడ్డి కూతురి పెళ్లి వేడుక ఒకటి. 500.. 1000 నోట్ల రద్దు ప్రభావం గాలి ఫ్యామిలీ మీద కూడా పడ్డప్పటికీ ఈ పెళ్లి విషయంలో వాళ్లు ఏమాత్రం తగ్గలేదు. కనీ వినీ ఎరుగని స్థాయిలో ఈ పెళ్లి వేడుకలో హంగామా కనిపిస్తోంది. అతిథుల కోసం భారీ ఏర్పాట్లే చేసింది గాలి ఫ్యామిలీ. వారిని అలరించడం కోసం సినీ సెలబ్రెటీలతో చాలా కార్యక్రమాలే ఏర్పాటు చేశాడు గాలి. తమన్నా.. రకుల్ ప్రీత్ సింగ్ లాంటి హీరోయిన్లకు భారీ పారితోషకాలిచ్చి తమ ఇంటి పెళ్లి వేడుకలో పెర్ఫామ్ చేయించాడు.

గాలి కూతురి పెళ్లిలో పెర్ఫామ్ చేసినందుకు తమన్నాకు ఏకంగా రూ.70 లక్షలు పారితోషకంగా ఇచ్చారన్న వార్త హాట్ టాపిక్ అవుతోంది. ఐతే దీనికి అంత ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని.. ఈ వేడుక కోసం కొందరు బాలీవుడ్ హీరోయిన్లకు కోటికి పైగా రెమ్యూనరేషన్ ఇవ్వడానికి కూడా గాలి రెడీ అయ్యాడని చెబుతున్నారు. బాలీవుడ్ భామలు ఆలియా భట్.. పరిణీతి చోప్రా లాంటి వాళ్లను కూడా ఈ వేడుక కోసం సంప్రదించారట. ఆలియాకు కోటి రూపాయలు.. పరిణీతికి ఏకంగా కోటిన్నర రూపాయలు పారితోషకం ఆఫర్ చేశారట. ఐతే వాళ్లిద్దరూ ఈ వేడుకలో డ్యాన్స్ చేయడానికి ఒప్పుకోలేదట. దీంతో సౌత్ భామలతోనే సర్దుకుపోవాల్సి వచ్చింది. తమన్నా.. రకుల్ లతో పాటు కేథరిన్ థ్రెసా.. శాన్వి లాంటి వాళ్లు ఈ వేడుకలో అతిథుల్ని అలరించారు. జబర్దస్త్ కమెడియన్లు కూడా ఇక్కడ పెర్ఫామ్ చేసి మంచి పారితోషకాలు పుచ్చుకున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News