గృహహింస నేపథ్యంలో ఇటీవలి కాలంలో దక్షిణాదిన సినిమాలేవీ తెరకెక్కిన జాడ లేదు. ఇంతలోనే బాలీవుడ్ లో ఇలాంటి కాన్సెప్ట్ తో 'డార్లింగ్స్' విడుదలైన సంగతి తెలిసిందే. ఆలియా భట్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలో నటించింది. జాస్మీత్ కె రీన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. షారూక్ తో కలిసి ఆలియా స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించింది. నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన ఈ సినిమాకి మిశ్రమ స్పందనలు వ్యక్తమయ్యాయి.
గృహహింస నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలోని విజువల్స్ డైలాగ్స్ పరంగా కూడా మెప్పుకోలు కాని కొన్ని కఠినమైన విషయాలు ఉన్నాయని విమర్శలొచ్చాయి. డార్లింగ్స్ చిత్రం దిగువ మధ్యతరగతి నేపథ్యం.. దుర్వినియోగం.. గృహ హింస .. కొంచెం కఠినమైన వాస్తవికతతో తెరకెక్కింది. దీనిని అన్నివర్గాల ప్రేక్షకులు అంగీకరిస్తారా? అన్న సందిగ్ధం వ్యక్తమవుతోంది.
తాజా గుసగుసల ప్రకారం.. ఇదే కాన్సెప్టుని నెట్ ఫ్లిక్స్ తెలుగు - తమిళంలో రీమేక్ చేయడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు కథనాలొస్తున్నాయి. నిజానికి ఓటీటీలో విడుదలైన ప్రతి సినిమాని సబ్ టైటిల్స్ తో వీక్షించే వెసులు బాటు ఉండగా మళ్లీ రీమేక్ చేస్తే ప్రజలు చూస్తారా? అన్న సందేహం వ్యక్తమవుతోంది. అలాగే ఆఫ్ బీట్ సినిమాలకు దక్షిణాదిన ఆదరణ దక్కుతుందా లేదా? అన్న సందిగ్ధతను కొందరు వ్యక్తం చేస్తున్నారు.
అయితే అన్ని రీమేక్ సినిమాలు జెర్సీ- హిట్ తరహాలో ఫెయిలవుతాయని చెప్పలేం. కొన్నిసార్లు లోకల్ ప్రేక్షకుల కోసం అవసరం మేర మార్పులు చేసి ఫ్రెష్ నెస్ తో రీమేక్ చేసి హిట్లు కొట్టిన సందర్భాలు లేకపోలేదు. అయితే ఇలాంటి కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ని హ్యాండిల్ చేయాలంటే నిపుణుడైన దర్శకుడు.. నటిగా ప్రూవ్ చేసిన స్టార్ హీరోయిన్ అయితేనే సక్సెస్ సాధ్యమవుతుందనేది ఒక సెక్షన్ విశ్లేషణ.
ఒకే ఏడాదిలో నాలుగు సినిమాలు...
ఆలియా ఒకే ఏడాదిలో నాలుగైదు సినిమాల్లో నటిస్తూ కెరీర్ పరంగా స్పీడ్ మీదున్న సంగతి తెలిసిందే. ఈ సంవత్సరం ఇప్పటికే ఆలియా నటించిన మూడు సినిమాలు రిలీజయ్యాయి. గంగూభాయి కతియావాడీ- ఆర్.ఆర్.ఆర్ లాంటి భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించాయి. గంగూభాయి చిత్రంలో ఆలియా తన నటనకు అవార్డులను ఆశిస్తోంది.
ఇక ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో కమర్షియల్ బ్లాక్ బస్టర్ ని అందుకున్నందుకు సంతృప్తిని వ్యక్తం చేసింది. ఇటీవల విడుదలైన 'డార్లింగ్స్'లోనూ ఆలియా నటనకు మంచి మార్చులే వేశారు క్రిటిక్స్. తదుపరి మరో భారీ పాన్ ఇండియా చిత్రం బ్రహ్మాస్త్ర విడుదల కానుంది. ఇందులో రణబీర్ కపూర్ సరసన ఆలియా నటించింది.