రిల‌య‌న్స్ ఆస్ప‌త్రిలో అలియా భ‌ట్ డెలివ‌రీ

Update: 2022-11-06 05:30 GMT
అలియాభ‌ట్- ర‌ణ‌బీర్ క‌పూర్ ప్రేమాయ‌ణం పెళ్లి అటుపై గ‌ర్భ‌ధార‌ణ ప్ర‌క‌ట‌న‌.. ఇవ‌న్నీ క‌ల‌లాగా చ‌క‌చ‌కా జ‌రిగిపోయాయి. పెళ్ల‌యిన మూడు నెల‌ల‌కే త‌న‌కు గ‌ర్భం అని ప్ర‌క‌టించి అలియా ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈ డిసెంబ‌ర్ లో డెలివ‌రీ ఉంటుంద‌ని కూడా వెల్ల‌డించింది ఈ జంట‌.

ఇంత‌లోనే తాజా స‌మాచారం మేర‌కు ఆలియాకు పురిటి నొప్పులు మొద‌ల‌య్యాయని తెలుస్తోంది. అలియా భట్ - రణబీర్ కపూర్ త్వరలో తమ బిడ్డను స్వాగతించనున్నట్లు సమాచారం. ఆసుపత్రి వర్గాల వివ‌రాల‌ ప్రకారం.. ఈ జంట‌ శిశువు ప్రసవం కోసం ఈ రోజు HN రిలయన్స్ ఆసుపత్రికి చేరుకున్నారు. తాను సి-సెక్షన్ చేయించుకునే అవకాశం ఉంది.

బాలీవుడ్ జంట ఆసుపత్రిలో ఉన్నారని తమ బిడ్డ రాక కోసం సిద్ధమవుతున్నారని తెలియ‌గానే అభిమానుల్లో ఉత్కంఠ నెల‌కొంది. ఆదివారం ఉదయం అలియాని ఆసుపత్రికి తరలించే స‌మ‌యంలో భర్తతో కలిసి ఉన్నారని మీడియా క‌థ‌నాలు నివేదించాయి. అయితే దీనిపై కుటుంబ సభ్యుల నుండి ఇంకా ఎటువంటి నిర్ధారణ లేదా అధికారిక‌ ప్రకటన రాలేదు.

ఇంతకుముందు అలియా - రణబీర్ బిడ్డ రాక తేదీని అలియా సోదరి షాలీన్ భ‌ట్ వెల్ల‌డించారు. ఊహాజనిత డెలివరీ తేదీ నవంబర్ 28 కి దగ్గరగా ఉందని ధృవీకరించారు. అయితే తాజా నివేదికల ప్రకారం సాధ్య‌మైనంత తొంద‌ర్లోనే బిడ్డ‌ పుట్టిన తేదీని ప్రకటించే స‌మ‌య‌మాస‌న్న‌మైంద‌ని తెలుస్తోంది.

పెళ్లి టైమ్ కే గర్భవతి...?

అలియా భట్ ఈ ఏడాది ఏప్రిల్ లో రణబీర్ కపూర్ ను వివాహం చేసుకున్నట్లు జూన్ లో సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఈ ప్రకటన వారి అభిమానులకు స్వీట్ సర్ ప్రైజ్ కావడంతో చర్చనీయాంశంగా మారింది. అలియా పెళ్లికి ముందే గర్భం దాల్చిందని అందుకే ఇంత హ‌డావుడిగా పెళ్లి వేడుకలు జరుగుతున్నాయని చాలా మంది ఊహించారు. ఇప్పుడు అది నిజ‌మేన‌ని నిరూప‌ణ అవుతోంది.
Tags:    

Similar News