ఓవర్సీస్@ $20 మిలియన్.. ఎవరెన్ని సార్లు టచ్ చేశారు?

ఓవర్సీస్‌లో 20 మిలియన్ డాలర్స్ కలెక్షన్ చేసిన అత్యధిక సినిమాలున్న భారతీయ సూపర్‌స్టార్స్ :-

Update: 2024-12-21 16:07 GMT

ఓవర్సీస్.. ఇండియన్ చిత్రాలకు మధ్య మంచి కనెక్షన్ ఉన్న విషయం తెలిసిందే. దాదాపు ఇండియన్ చిత్రాలన్నీ అక్కడ రిలీజ్ అవుతున్నాయి. కొన్ని సినిమాలకు ప్రీమియర్ షోస్ కూడా పడుతున్నాయి. మరికొన్ని మూవీస్.. ఫారిన్ భాషల్లోనూ రిలీజ్ అయి సందడి చేస్తున్నాయి. దీంతో ఓవర్సీస్ లో ఉన్న ఇండియన్స్.. ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారు.

ఓవర్సీస్ లో రిలీజ్ అయిన తొలి ఇండియన్ మూవీగా 'ఆన్' నిలిచింది. 1952లో విడుదలైన ఆ సినిమాకు మెహబూబ్ ఖాన్ దర్శకత్వం వహించగా.. దిలీప్ కుమార్, నిమ్మీ లీడ్ రోల్స్ లో నటించారు. అమెరికా, ఫ్రాన్స్, జపాన్ సహా 28 దేశాల్లో రిలీజ్ అయింది. అలా అప్పటి నుంచి ఓవర్సీస్ లో భారతీయ సినిమాలు.. సందడి చేస్తూనే ఉన్నాయి.

అయితే ఏటా అనేక సినిమాలు రిలీజ్ అవ్వగా.. కొన్ని అక్కడ భారీ వసూళ్లను రాబడతాయన్న విషయం తెలిసిందే. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద ఉన్న రికార్డులను బద్దలు కొడుతుంటాయి. మరికొన్ని కొత్తవి క్రియేట్ చేస్తుంటాయి. ఇంకొన్ని నెవ్వర్ బిఫోర్ అనేలా దూసుకుపోతుంటాయి. ఉదాహరణకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప-2 అనే చెప్పాలి.

ఇక ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద ఇప్పటికే అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాగా అమీర్ ఖాన్ దంగల్ నిలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత జాబితాలో పలు సినిమాలు ఉన్నాయి. అయితే ఇప్పటి వరకు ఓవర్సీస్ లో 20 మిలియన్ల డాలర్లకు పైగా అనేక భారతీయ చిత్రాలు రాబట్టాయి. అలా పలువురు హీరోలు.. ఓవర్సీస్ బాక్సాఫీస్ వద్ద $20 మిలియన్ మార్క్ టచ్ చేశారు.

అయితే బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్.. ఇప్పటి వరకు అత్యధికంగా ఆరు సార్లు.. ఆ ఘనత అందుకున్నారు. మరో బీటౌన్ స్టార్ హీరో అమీర్ ఖాన్ నాలుగు సార్లు.. $20 మిలియన్ మార్క్ టచ్ చేశారు. కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన మూడు సినిమాలు.. ఓవర్సీస్ లో 20 మిలియన్ల డాలర్లు రాబట్టి సత్తా చాటాయి. అందులో బజరంగీ భాయీజాన్ అత్యదిక కలెక్షన్లు అందుకుంది. రణబీర్ కపూర్ రెండు సినిమాలు ఆ క్లబ్ లో ఉన్నాయి. అందులో యానిమల్ అత్యధిక కలెక్షన్స్ రాబట్టింది.

ఇక సౌత్ నుంచి కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ యాక్ట్ చేసిన రెండు సినిమాలు.. ఓవర్సీస్ లో 20 మిలియన్ల డాలర్లు రాబట్టాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బాహుబలి, కల్కి చిత్రాలు రెండు.. $20 మిలియన్ మార్క్ టచ్ చేశాయి. ఫ్యూచర్ లో మరింత మంది స్టార్ హీరోలు ఆ లిస్ట్ లో చేరుతారని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. మరి చూడాలి ఎవరెవరు వెళ్తారో..

ఓవర్సీస్‌లో 20 మిలియన్ డాలర్స్ కలెక్షన్ చేసిన అత్యధిక సినిమాలున్న భారతీయ సూపర్‌స్టార్స్ :-

1. షారుఖ్ ఖాన్ - 6 సినిమాలు

2. ఆమిర్‌ఖాన్ - 4 సినిమాలు

3. సల్మాన్‌ఖాన్ - 3 సినిమాలు

4. ప్రభాస్ - 2 సినిమాలు

5. రజనీకాంత్ - 2 సినిమాలు

6. రణబీర్‌కపూర్ - 2 సినిమాలు

Tags:    

Similar News