గద్దర్ అవార్డులు వచ్చేస్తున్నాయహో..!
మార్చి 13 నుంచి గద్దర్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ ప్రారంభించాలని ఏప్రిల్ లో గ్రాండ్ గా ఈ అవార్డుల వేడుక నిర్వహించాలని చూస్తున్నారు.;
ఏపీలో ప్రతిభ చూపించిన సినీ కళాకారుల కోసం నంది అవార్డులను ప్రదానం చేసేవారు. ఒకప్పుడు ఆ అవార్డు వేడుకలను ప్రభుత్వం నిర్వహించేది. ఐతే తెలంగాణ ఏర్పడ్డాక ఏపీ లో నంది అవార్డులు ఇవ్వలేదు. తెలంగాణ ఏర్పడి 10 ఏళ్లు అవుతున్నా ఇక్కడ కూడా ప్రభుత్వం నంది అవార్డుల ప్రస్తావన తీసుకు రాలేదు. తెలంగాణా ప్రభుత్వం తరపున సినీ కార్మికులకు గద్దర్ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించారు.
దీనికి సంబంధించిన విధి విధానాల గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చర్చించారని తెలుస్తుంది. మార్చి 13 నుంచి గద్దర్ అవార్డులకు సంబంధించిన నామినేషన్స్ ప్రారంభించాలని ఏప్రిల్ లో గ్రాండ్ గా ఈ అవార్డుల వేడుక నిర్వహించాలని చూస్తున్నారు. 2010 నుంచి 2023 వరకు రిలీజైన సినిమాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున గద్దర్ అవార్డులను ఇవ్వనున్నారు.
ఇక ఈ గద్దర్ అవార్డుల కేటగిరీలను నిర్ణయించినట్టు తెలుస్తుంది. వాటిలో ఫీచర్ ఫిలిం, నేషనల్ ఇంటిగ్రేషన్ ఫిలిం, చిల్డ్రెన్స్ ఫిల్మ్, ఫిల్మ్ ఆన్ ఎన్విరాన్మెంట్/హెరిటేజ్/హిస్టరీ, డిబట్ ఫీచర్ ఫిల్మ్, యానిమేటెడ్ ఫిల్మ్, సోషల్ ఇంప్యాక్ట్ ఫిల్మ్, డాక్యుమెంటరీ ఫిల్మ్, షార్ట్ ఫిల్మ్ ఈ కేటగిరీల్లో గద్దర్ అవార్డుల ప్రధానం జరుగుతుంది.
తెలంగాణాలో మొదటిసారి జరుగుతున్న సినీ వేడుక కాబట్టి తప్పకుండా ఈ ఈవెంట్ పై అందరి దృష్టి ఉంది. తెలంగాణ అవార్డుల ప్రధానోత్సవంపై ప్రభుత్వం ఎక్కువ ఫోకస్ చేస్తుంది. గద్దర్ పేరు మీద ఇవ్వబోతున్న ఈ అవార్డుల గురించి ఎన్నో ఏళ్లుగా చర్చలు జరుగుతున్నాయి.
మరోపక్క ఏపీలో కూడా నంది అవార్డులు చాలా ఏళ్లుగా ఇవ్వట్లేదు. అక్కడ కూడా నంది అవార్డుల విషయంలో ప్రభుత్వం చొరవ చూపించాలని చూస్తుంది. అంతకుముందు తెలంగాణ లో ఇచ్చే అవార్డులకు సింహా అవార్డులుగా ఇవ్వాలని అనుకున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కళాకారుడు గద్దర్ పేరు మీద ఈ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. ఐతే పదేళ్లుగా రిలీజైన సినిమాలన్నిటీలో సెలెక్ట్ చేసిన కేటగిరీల్లో అవార్డుల ప్రధానోత్సవం చేయనున్నారు. తెలంగాణా ప్రభుత్వం ఈ వేడుకలను భారీగా వీటిని నిర్వహించాలని చూస్తున్నారు.