'సంక్రాంతికి' బ్యూటీలు.. ఫ్యామిలీ ఆడియన్స్ పై ఫోకస్?
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం.
టాలీవుడ్ సీనియర్ హీరో విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ సంక్రాంతికి వస్తున్నాం. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా.. జనవరి 14వ తేదీన విడుదల కానుంది. ఇప్పటికే వెంకీ, అనిల్ కాంబోలో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 చిత్రాలు మంచి హిట్ అవ్వడంతో.. ఇప్పుడు భారీ అంచనాలు నెలకొన్నాయి.
కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న సంక్రాంతికి వస్తున్నాం సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఐశ్వర్య రాజేష్, మీనాక్షీ చౌదరి హీరోయిన్ గా యాక్ట్ చేస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తవ్వగా.. ఇప్పుడు ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు ఇద్దరు భామలు.
డైరెక్టర్ అనిల్ రావిపూడితో కలిసి ఐశ్వర్య, మీనాక్షీ టీవీ షోల్లో సందడి చేస్తున్నారు. రీసెంట్ గా యాంకర్ ఓంకార్ హోస్ట్ చేస్తున్న రొమాంటిక్ రియాలిటీ గేమ్ షో ఇస్మార్ట్ జోడీ సీజన్ 3 ఎపిసోడ్ కు వెళ్లారు. అందుకు సంబంధించిన గ్లింప్స్ ఇప్పటికే సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇప్పుడు మరో ప్రోగ్రామ్ కు వెళ్లారు.
సంక్రాంతి స్పెషల్ గా ఓ ఛానెల్ ఏర్పాటు చేసిన సోషల్ ఈవెంట్ 'ఈ సంక్రాంతికి వస్తున్నాం'లో ఐశ్వర్య, మీనాక్షి సందడి చేశారు. వారితో పాటు అనిల్ రావిపూడి సహా పలువురు ఉన్నారు. మొత్తానికి ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న సినిమాపై ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు ఇద్దరు బ్యూటీలు.
అయితే సంక్రాంతికి వస్తున్నాం మూవీ నుంచి మేకర్స్ ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, సాంగ్స్ కు ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పటికీ నెట్టింట ట్రెండ్ అవుతూనే ఉంటున్నాయి. గోదారి గట్టు మీద రామ చిలకవే సాంగ్ అయితే చెప్పనక్కర్లేదు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అదే పాట కనిపిస్తోంది.
ప్రముఖ సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో తన వర్క్ తో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేశారు. సినిమాపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యేలా చేశారు. త్వరలో మరిన్ని సాంగ్స్ ను రిలీజ్ చేయనున్నారు. దాంతోపాటు ట్రైలర్ కోసం వెయిట్ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో మేకర్స్.. ట్రైలర్ ను విడుదల చేయనున్నారు. మరి సంక్రాంతి వస్తున్నాం సినిమా ఎలాంటి విజయం సాధిస్తుందో.. ఎలా అలరిస్తుందో వేచి చూడాలి.