కొందరి జోలికి అసలు పోకూడదు. అలా సున్నం పెట్టుకునే ముందే ఎవరు 'అరిటాకు'.. ఎవరు 'ముల్లు' అనేది క్లారిటీ ఉండాలి. కంగనా సంగతే తీసుకుంటే ఎవరితో ఆమె గొడవ పెట్టుకున్నా ముల్లు మాత్రం ఆమే. కంగనా సోదరి రంగోలి చందేల్ ముల్లు 2.0. ఆటోమేటిక్ గా అవతల పార్టీవారు పొడవాటి అరిటాకులు అవుతారు. కంగనాతో గొడవ పెట్టుకున్నది ఎవరైనా సరే.. ఆ అరిటాకు చీలికలు పేలికలుగా చిరగడం ఖాయం. అందుకే చాలామంది కంగనా విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తిసారు. ఇక్కడ తప్పుప్పుల ప్రసక్తే లేదు. తాజాగా అలియా భట్ కూడా అలాగే వ్యవహరించింది.
రీసెంట్ గా కంగనా అలియా భట్ పై విరుచుకుపడింది . 'మణికర్ణిక' లో కంగనా నటనను 'గల్లీ బాయ్' లో అలియా నటనను పోల్చడంతో ఆ ఉపద్రవం సంభవించింది. 'గల్లీ బాయ్' లో అలియాది అత్తెసరు నటనే అని తేల్చేసింది. అంతే కాదు.. ఊరికే స్టార్ కిడ్స్ ను ఆకాశానికి ఎత్తడం మానేయమని మీడియాకు కూడా చురక అంటించింది. ఈ విషయంలో అలియా స్పందన కోరితే చాలా జాగ్రత్తగా.. లౌక్యంగా స్పందించింది. "కంగనా వర్క్ అంటే నా కు చాలా గౌరవం ఉంది. ఆమె అభిప్రాయాన్ని కూడా నేను గౌరవిస్తాను. కంగనా కనుక నన్ను అలా అని ఉంటే దానికో కారణం ఉంటుంది. 'రాజి' చూసిన తర్వాత నా నటనను కంగనా ఎంత ప్రశంసించిందో నాకు తెలుసు. అందుకే నేను నా వర్క్ పై ఫోకస్ చేయదలుచుకున్నాను. నేను కనుక మరింతగా కష్టపడితే నా నటనను కంగనా మెచ్చుకోవచ్చు" అంటూ ముగించింది. అంతే కానీ కంగనాను విమర్శించే ధైర్యం చేయలేదు.
చూసేందుకు అలియా అమాయకంగా ఉన్నా లౌక్యం మాత్రం టన్నుల్లో ఉంది. కంగనాకు అలియా గట్టిగా కౌంటర్ ఇచ్చి ఉంటే అప్పుడు ఉండేది నా సామి రంగ.. జూన్ లో ఈద్ పండగ వచ్చే దాకా కంగనా చేతిలో జింతాత జిత ఉండేది. పనిలో పనిగా బాలీవుడ్ నెపోటిజం పితామహుడు కరణ్ ను కుడా ఈ గొడవలోకి లాగి ఉండేది. కానీ అలియా తెలివిగా సమాధానం ఇచ్చి కంగనా దాడి నుంచి తప్పించుకుంది.. కరణ్ ను కూడా సేవ్ చేసింది!