యంగ్ హీరోయిన్లలో ఆలియా భట్ కు ఉన్నంత క్రేజ్ మరో భామకు లేదనే మాటను ఒప్పుకుని తీరాల్సిందే. ఇందుకు కారణం అమ్మడి స్ట్రైట్ అండ్ ఫార్వార్డ్ నెస్. అంతెందుకు.. ఉడ్తా పంజాబ్ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా.. ధైర్యంగా బూతులు మాట్లేడేసింది. కెమేరా ముందు ఈ రేంజ్ వల్గర్ డైలాగ్స్ చెప్పడం ఆలియాకి తప్ప వేరెవరికి సాధ్యం కాదని అంగీకరించాల్సిందే. అవి సినిమాలో డైలాగ్సే అయినా.. వాటిని ఆఫ్ స్క్రీన్ లో చెప్పేందుకు చాలా ధైర్యం కావాలి కదా. అఫ్ కోర్.. చివర్లో ఇవి పిల్లలకు కాదు ఓన్లీ ఫర్ అడల్ట్స్ అంటూ ఓ క్లారిటీ కూడా ఇచ్చింది.
'ఉడ్తా పంజాబ్ స్క్రిప్ట్ చదవగానే ఈ సమస్య గురించి ప్రపంచానికి చెప్పాలని అనిపించింది. డ్రగ్స్ పై మన దేశమే కాదు... ప్రపంచం కూడా సమస్యను ఎదుర్కుంటోంది. నాకిప్పటివరకూ ఇలాంటి స్టోరీ ఎవరూ చెప్పలేదు. ఎలాంటి రిఫరెన్సులు లేకుండానే.. సొంతగా ఊహించుకుని, ఈ సినిమా చేశా' అంటోంది ఆలియా. ఉడ్తాపంజాబ్ లో డీగ్లామర్ రోల్ చేసింది ఆలియా. ఆ పాత్రకు డీగ్లామ్ అనే పేరు కూడా చిన్నదే కావచ్చు. అలాంటి పాత్రలో నటించింది.
ఉడ్తా పంజాబ్ మూవీ మొత్తంలో ఆలియా పాత్రకే ఎక్కువ మార్కులు పడుతున్నాయి. ఒకే ఒక్క డ్రగ్ ప్యాకెట్ తో జీవితాన్ని మార్చేసుకుందామని ప్రయత్నించి.. ఆ కారణంగానే డ్రగ్ రాకెట్ లో ఇరుక్కుపోయి.. ప్రపంచాన్ని ఓ కిటికీ లోంచి చూసే ఔత్సాహిక హాకీ ప్లేయర్ గా ఆలియా పాత్రకు బోలెడన్ని ప్రశంసలు దక్కుతున్నాయి. త్వరలో షారూక్ తో ఓ సినిమాలో కనిపించనుండడంతో.. తెగ ఉత్సాహంగా ఉన్నానంటోంది ఆలియా భట్.