ఒక సినిమా బడ్జెట్ ఎక్కువ అవడానికి ప్రధాన కారణం దాంట్లో నటించే హీరో హీరోయిన్ల రెమ్యూనరేషన్. అయితే ఇది ఒక్కొక్క ఇండస్ట్రీలో ఒకలా ఉంటూ ఉంటుంది. మన టాలీవుడ్ ఇండస్ట్రీ విషయానికొస్తే హీరో పదికోట్లు తీసుకున్నా ఓస్ ఇంతేనే అంటాం.. కానీ హీరోయిన్ కోటి తీసుకుంటుందంటే అబ్బో.. మరీ అంతా అని పెదవి విరుస్తుంటాం. ఎంతైనా మేల్ డామినేషన్ ఇండస్ట్రీ కదా.. వాస్తవానికి సినిమా ఇండస్ట్రీలో హీరోలతో పాటు హీరోయిన్స్ కూ సూపర్ క్రేజ్ ఉంటుంది. ఇందులో బాలీవుడ్ టాలీవుడ్ అని తేడా లేదు. సినిమా హిట్ అయితే ఆ క్రెడిట్ హీరోతో పాటు హీరోయిన్స్ కు దక్కుతుంది. అంతేకాదు రెమ్యునరేషన్ విషయంలోనూ ఇది వరకు లక్షల్లో ఉన్న నటీమణులు మేము ఎందులో తక్కువ మాకూ కావాలి కోట్లు అంటూ హీరోలతో సమానంగా తీసుకుంటున్నారు. కొన్ని సినిమాలకైతే హీరో కంటే ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటూ సినిమా రంగంలోనూ వారి హవాను కొనసాగిస్తున్నారు. టాలీవుడ్ లో ఒక హీరోయిన్ కి వరసగా నాలుగు హిట్లు పడ్డాయంటే ఇక ఆ హీరోయిన్ రెమ్యూనరేషన్ సినిమాకి కనీసం కోటి నుండి రెండు కోట్లు డిమాండ్ చేస్తుంటారు. అయితే తెలుగులో ఇప్పటి వరకు ఒక్క సినిమాలో కూడా నటించని ఒక హాట్ బ్యూటీ మాత్రం ఏకంగా రోజుకు అర కోటి వసూలు చేస్తుందంట.
ఆమె ఎవరో కాదు బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్. ఈ అమ్మడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న 'ఆర్.ఆర్ ఆర్' లో నటిస్తున్న విషయం తెలిసిందే. పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న సినిమా కావడంతో ఈ చిత్రానికి క్రేజీ కాస్టింగ్ అవసరమని భావించిన జక్కన్న అలియాను హీరోయిన్ గా తీసుకున్నాడు. ఆలియా ఈ చిత్రంలో నటించడానికి భారీ మొత్తంలోనే డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆర్.ఆర్ ఆర్ కోసం ఆలియా భట్ కేటాయించిన 10 రోజుల కాల్షీట్స్ కోసం ఏకంగా 5 కోట్లు నిర్మాతల దగ్గర వసూలు చేస్తున్నదని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అంటే రోజుకి అర కోటి రూపాయలన్న మాట. ఇదే కనుక నిజమైతే టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్ గా అలియాను చెప్పుకోవచ్చు. టాలీవుడ్ లో ఇప్పటి వరకు అనుష్క - నయనతార - సమంత - కాజల్ - పుజాహెగ్డేలు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతూ అందరి కంటే పారితోషకంలో కొంచెం ఎక్కువ తీసుకుంటుంటారు. వీళ్లతో పోల్చుకుంటే ఆలియా తీసుకుంది చాలా ఎక్కువనే చెప్పాలి. ఈ చిత్రానికి డీవీవీ దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.